పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిమ క్రైస్తవుల్లోని ఐక్యభావం, సమానత్వం, తమ సొమ్మను ఇతరులతో పంచుకోవడం అనే గుణాలు పేద వర్గాలవారిని బాగా ప్రభావితం చేసాయి. పేదప్రజలు వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఈ క్రైస్తవ సమాజంలో చేరారు. ఈ séÓeX) ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకొంటున్నారో చూడండి అని ఆనాటి గ్రీకు రోమను పౌరులు ఆశ్చర్యపోయేవాళ్ళ ఆనాటి క్రైస్తవుల్లో మనమందరం సరిసమానం అనే భావం ప్రబలంగా వుండేది. తొలినాటి వేదబోధకులు కూడ క్రైస్తవుల్లో సమానత్వం వండాలనే భావాన్ని బాగా విశదీకరించి చెప్పారు. క్రీస్తు శరీరాన్ని భుజించేవాళ్ళు క్రీస్తు శరీరమే ఐన తిరుసభ సభ్యులను, విశేషంగా పేద సభ్యులను, పట్టించుకోవాలని నొక్కి చెప్పారు. ఈలా దివ్యభోజనం ఆదిమ సమాజంలో సోదరప్రేమను పెంచింది.

3. మధ్య యుగాల్లో వచ్చిన మార్పు

తొలి క్రైస్తవుల్లో సత్రసాదం సోదర ప్రేమకు కారణంగాను, ధనికులు తమ సొత్తును పేదలతో పంచుకోవడానికి ప్రేరణం గాను ఉండేదని చెప్పాం. కాని మధ్య యుగాల్లో సత్రసాదం కేవలం ఆరాధ్య వస్తువుగా మారిపోయింది. అది సమసమజాన్ని స్థాపిస్తుందనే భావం పోయి కేవలం దేవుణ్ణి ఆరాధించే వస్తువుగా తయారైంది. గురువులు దానిచుటూ కర్మకాండలూ, తంతులూ, ఆరాధనలూ పెంచారు, గృహస్థలు ఈ యారాధనలో పాల్గొని పవిత్రులు కావడమే ముఖ్యం అనుకొన్నారు. అది నరులను పరలోకానికి చేర్చే సాధనంగా మారిపోయింది. ఈ లోకంలో భక్తసమాజాన్ని తయారుచేసే సాధనమన్న భావం మరుగున పడింది. ప్రజలు అది మనలను క్రీస్తుతో ఐక్యంజేసే సాధనమనుకొన్నారు. సోదరీ సోదరులైన తోడి నరులతో ఐక్యంజేసే సాధనమన్న సంగతి విస్మరించారు. ఈలా సత్రసాదాన్ని దైవప్రేమతో ముడిపెట్టి సోదర ప్రేమను అశ్రద్ధ చేసారు. భక్తులు దేవునివైపు తిరిగి తోడి నరులవైపు చూడ్డం మానివేసారు.

4. సత్ర్పసాదమూ భారతీయ సమాజమూ

మనదేశంలో కన్పించే సత్రసాద భక్తి యూరపులోని మధ్యయుగాల భక్తి లాంటిదే. అది దేవుణ్ణి కలసికొనే సాధనమే గాని నరులను కలసికొనే సాధనం కాదు. ఎప్పడు కూడ దేవుణ్ణి పూజించడం సులభం. ఆ దేవుణ్ణి తోడినరుల్లో గుర్తించి వారిని అంగీకరించి ఆదరించడం కష్టం. దైవప్రేమ సులువు, సోదరప్రమ భారం. కాని దేవుని రూపంగల తోడి నరులను పట్టించుకోని దైవారాధనం నిజమైన ఆరాధనం ఎలా ఔతుంది? మన సత్ర్పసాద భక్తి మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మన దేవాలయాల్లో దివ్యభోజనాన్ని