పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. దివ్యస్తసాదమూ నూతసమాజమూ

బైబులు భాష్యం - 147

విషయసూచిక

1.న్నూత్న సమాజం కోరికలు
2.ఆదిమ క్రైస్తవ సమాజంలో సత్రసాదం
3.మధ్యయుగాల్లో వచ్చిన మార్పు
4.సత్రసాదమూ భారతీయ సమాజం
5.రెండవ వాటికన్ మహాసభ తర్వాత
6.సత్రసాద భావంలో మార్పు
7.సత్ర్పసాదమూ నూత్నసమాజ స్థాపనం
8.సత్ర్పసాద ఫలితాలు
9.సత్రసాదం విసిరే సవాళ్ళ

బైబులు భగవంతుడు ప్రేమమయుడు. అతనిలోని ముగ్గురు వ్యక్తులు పరస్పర ప్రేమతో ఐక్యమై యుంటారు. అతడు మానవజాతిని సృజించినపుడు తనలాగే వాళ్లుకూడ పరస్పర ప్రేమతో జీవించాలని కోరుకొన్నాడు. కాని సృష్ట్యాదిలో కయీను హేబెలును చంపినపుడే నరులు ప్రేమతో జీవించలేరని తేలిపోయింది, వాళ్లు జీవానికి మారుగా మరణాన్నే కోరుకొంటారని రుజువైంది.

క్రీస్తు దేవుని ప్రేమను మనకు తెలియజేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అతని బోధలు, అద్భుతాలు, విశేషంగా అతని మరణోత్తానాలు ఈ ప్రేమనే విశదం చేస్తాయి. అతడు స్థాపించిన క్రైస్తవ సమాజం ప్రధానంగా ప్రేమతో జీవించాలి. అతడు మీ పరస్పర ప్రేమను జూచి లోకం మిమ్మలను నా శిష్యులనుగా గుర్తిస్తుంది అన్నాడు - యోహా 13,35. క్రీస్తు శిష్యులకు నిజమైన గుర్తు సోదర ప్రేమ ఒక్కటే.

దివ్యసత్రసాదం ప్రేమతో గూడిన క్రీస్తు మరణిశోత్థానాలను మనకు జ్ఞప్తికి తెస్తుంది. అది అతని రక్షణ కార్యాన్ని మన మధ్యలో కొనసాగిసూ మనలో సోదరప్రేమను పెంచుతుంది. తొలినాటి క్రైస్తవులు దివ్యసత్రసాద బలంతో సోదర ప్రేమతో జీవించారు. వారి ప్రేమ భావానికి ముగ్గులై రోమను మతస్థులు చాలమంది ఆదిమ క్రైస్తవ సమాజంలో • చేరారు. సత్రసాదం దేవుణ్ణి ఆరాధించే సాధనం. కాని అంతకంటె ముఖ్యంగా అది