పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం - 7

1.పూర్వవేదంలోని సాన్నిధ్యాన్ని గూర్చి తెలియజేయండి.
2.దివ్యసత్రసాదంలో దైవసాన్నిధ్యముందని పరోక్షంగానైనా నిరూపించే నూత్నవేద సందర్భాన్ని ఒకదాన్ని వివరించండి.
3.రొట్టెరసాల్లో దైవసాన్నిధ్యం నెలకొనడాన్ని గూర్చి మన నమ్మకానికీ ప్రోటస్టెంటుల నమ్మకానికీ వున్న తేడా యేమిటి?
4.సత్రసాదంలో దైవసాన్నిధ్యం ఎంతకాలముంటుంది అన్న ప్రశ్నకు ప్రోటస్టెంటుల జవాబేమిటి?
5.మన జవాబేమిటి? “సత్ర్పసాదంలోని క్రీస్తు సాన్నిధ్యం స్థానికమైంది కాదు వ్యక్తిగతమైంది" - వివరించండి. 6.ఆరాధన సందర్భానికి చెందిన దైవసాన్నిధ్యాలు నాలూ ఏవేవి?

అధ్యాయం - 8

1.సత్రసాద విషయంలో మొదటిలో లేని ఆరాధన పద్ధతి 11వ శతాబ్దం తర్వాత ఏలా ప్రచారంలోకి వచ్చింది? 2.ప్రోటస్టెంటు క్రైస్తవులు సత్రసాద సాన్నిధ్యాన్ని ఎందుకు నిరాకరిస్తారు?
3.ఆ సాన్నిధ్యాన్ని సమర్ధించడం ఏలా?
4.సత్ర్పసాదాన్ని సందర్శించేపుడు మనకు ఏలాంటి భక్తిభావాలుండాలి?

అధ్యాయం - 9

1.దివ్యభోజనాన్ని గూర్చి యోహాను సువిశేషం తెలియజేసే భావాలను పేర్కొనండి.
2.సిరిల్ భక్తుని భావాల ప్రకారం క్రీస్తు జీవమయ శరీరం మనలను గూడ జీవమయులను చేస్తుంది. ఏలాగ? 3."పూజారాధనం ఇచ్చి పుచ్చుకోవడంతో కూడి వుంటుంది"....ఏలాగ?
4.దివ్యసత్రసాదాన్ని ద్విరూపంలో భుజించడం అవసరమా?
5.ఇరెనేయుస్ భావం ప్రకారం సత్రసాదం మనకేలా ఉత్థాన భాగ్యాన్ని దయచేస్తుంది? ఇదే ఉత్తాన భావాన్ని సిరిల్ ఏలా వర్ణించాడు?

అధ్యాయం - 10

1.నూత్నవేదం ప్రకారం దివ్యసత్ర్పసాదం ఏలా సంఘిభావం కలిగిస్తుంది?
2.డిడాకే గ్రంథం ప్రకారం సత్రసాదం మనకు ఏలా ఐక్యతాభావం కలిగిస్తుంది?