పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3.కిప్పూర్ ప్రాయశ్చిత్త బలికీ క్రీస్తు సిలువబలికీ గల మూడు పోలికలను తెలియజేయండి.
4.మలాకీ ప్రవచనం నూత్న వేదబలికి ఏలా వర్తిస్తుంది?
5."బలి మనలను పవిత్రం చేయదు. మన హృదయం లోని భక్లే ఆ బలిని పవిత్రం చేస్తుంది" అన్న ఇరెనేయస్ వాక్యం భావం ఏమిటి?

అధ్యాయం - 4

1.అంత్యభోజనమూ పూజబలీ యథార్థమైన బలి అని నూత్నవేదం నుండి నిరూపించడం ఏలా?
2.మోక్ష క్రీస్తు ఆరాధనం ఏ రూపంలో వుంటుంది?
3.ప్రోటస్టెంటు నాయకులు పూజబలి కల్వరిబలికి అవమానకరం అని ఎందుకు భావించారు? వాళ్ళకు జవాబు చెప్పడం ఏలా?
4."నది జన్మస్థలం మీద ఆధారపడినట్లే పూజబలి సిలువబలి మీద ఆధారపడుతుంది? - వివరించండి.
5.“మన శరీరాలను సజీవయాగంగా దేవునికి అర్పించుకోవాలి" (රි” කියැං 12,1) అనడంలో పౌలు భావం ఏమిటి?

అధ్యాయం - 5

1.పూర్వ నూత్నవేదాల ఆరాధనం సామాజికమైంది అని బైబులు నుండి ఏలా నిరూపించగలం?
2."గృహస్థలు లేకుండా గురువు సొంతంగా చేసికొనే పూజ చెల్లదు” అనే ప్రోటస్టెంటు వాదానికి జవాబు చెప్పడం ఏలా?
3.గురువు పూజార్పణానికీ గృహస్తుల పూజార్పణానికీ తేడా ఏమిటి?
4."స్థానిక శ్రీసభ పూజ విశ్వశ్రీసభ పూజకూడ" వివరించండి.
5.సామాన్య పూజకంటె సంయుక్తపూజ ఎందుకు మెరుగు?

అధ్యాయం - 6

1.పూజ ఫలితాలను నాల్డింటిని వివరించండి.
2. పూజ వలన పాపపరిహారం పొందం అని వాదించేవాళ్ళకు జవాబు చెప్పడం ఏలా?
3.పూజ నుండి మనం పూర్తి ఫలితాన్ని పొందుతామా? ఎందుకు?