పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4.శ్రీసభ ఆరాధనంలో తుదిమెట్టు సత్రసాదబలి,ఇంతకంటె శ్రేష్టమైన ఆరాధనను దేన్నీ శ్రీసభ సమర్పించలేదు. ఈబలి వరప్రసాదాలన్నిటికీ జీవధార లాంటిది. విశ్వాసులు ఏ వరప్రసాదాన్ని పొందినా దీనినుండి పొందవలసిందే. ఈ బలినర్పించడం ద్వారా విశ్వాసులు క్రీస్తుని పూర్ణంగా సాక్షాత్కారం చేసికొంటారు, అతన్ని లోకానికి ప్రకటిస్తారు గూడ. నేడు శ్రీసభ సభ్యులంగా సత్రసాదబలి నర్పించడం కంటె మనం చేయదగిన ఉత్తమ పుణ్యకార్యమేమీ లేదు. కనుకనే 12వ భక్తినాథ పాపుగారు "క్రైస్తవుడంటే ప్రధానంగా పూజబలి నర్పించేవాడు" అని నుడివారు.

అధ్యాయం - 1

1.పాస్క నిబంధన బలులను వివరించండి.
2.అంత్యభోజన వర్ణన విషయంలో మత్తయి మార్కులకూ, లూకా పౌలులకూ వ్యత్యాసం ఏమిటి? 3."యేసు ఈ లోకం నుండి తండ్రి వద్దకు సాగిపోవలసిన గడియ వచ్చిందని యెరిగిన వాడై" (యోహా 13,1) అనడంలో యోహాను భావం ఏమిటి?
4.అంతిమ భోజనానికీ సిలువ బలికీ వున్న సంబంధం ఏమిటి?
5.అసలు అంతిమ భోజనంతో అవసరం ఏమిటి?
6.అంత్య భోజనానికీ నేటి పూజబలికీ ఉన్న సంబంధం ఏమిటి?

అధ్యాయం - 2

1.మనపూజలో "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి" అన్నమాటలు వస్తాయి. పూజలో ఎవరు, ఎవరికి ఏమి జ్ఞాపకం చేయాలి?
2."జ్ఞాపకార్థం అంటే పూర్వం జరిగిన ఓ రక్షణ సంఘటనాన్ని ఇప్పడు గుర్తుకి తెచ్చుకోవడం మాత్రమే కాదు, దాన్ని మళ్ళా మన మధ్యలో ప్రత్యక్షం చేసికోవడం” - ఈ సూత్రం పూజబలి కేలా వర్తిస్తుందో వివరించండి.
3.భక్తులు క్రీస్తు మరణాన్ని "ప్రకటిస్తారు” (1కొ 11,26) అనడంలో పౌలు భావం ఏమిటి?

అధ్యాయం - 3

రక్తరహితాలు,1. రక్తసహితాలు ఐన పూర్వవేద బలులను వివరించండి.
2."బలి ముఖ్యోద్దేశం భగవంతునితో ఐక్యంగావడమే” - వివరించండి.