పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రార్థనాభావాలు

1.దివ్యసత్ర్పసాదం క్రైస్తవులను ఐక్యపరచే సంస్కారమని చెప్పాం. కాని దురదృష్టవశాత్తు నేడు క్రైస్తవ శాఖలు విడిపోయి వున్నాయి. క్రైస్తవులందరికీ ప్రభువు ఆశించిన ఐక్యత సిద్ధించాలని ఈ దివ్యసత్ర్పసాద సాన్నిధ్యంలో అందరమూ ప్రార్థించాలి. చారిత్రకంగా జూస్తే ఓ అంశం బోధపడుతుంది. 13-16 శతాబ్దాల మధ్య విశ్వాసులు సత్ర్పసాదాన్ని అట్టే భుజించలేదు. దాని బలం సన్నగిల్లి పోయింది కనుకనే 18వ శతాబ్దంలో పదియవ భక్తినాథ పోపుగారు విశ్వాసులు దినదినమూ ఈ విందులో పాల్గొనాలని శ్రీముఖం వ్రాసారు. ఇదే శతాబ్దంలో ప్రోటస్టెంటు క్యాతలిక్కు $ର୍ତ୍ତ୬ మధ్య సమైక్యతా ఉద్యమం గూడ ప్రారంభమైంది. కనుక దివ్యసత్ర్పసాదానికీ సమైక్యతకీ దగ్గరి సంబంధం వుందని అర్థం చేసికోవాలి. అసలు నాల్గవ శతాబ్దంలోనే అగస్టీను భక్తుడు దీన్ని సమైక్యతా సాధనమని పేర్కొన్నాడు. కనుక మనం ఈ విందును భక్తిపూరితంగా భుజిస్తే సమైక్యత గూడ సులభమరొతుంది.

2.ఇతర క్రైస్తవ శాఖలతో మనకు ఐక్యత లేకపోవడం పెద్ద దురదృష్టం. కాని మన శాఖీయులతోనే మనకు ఐక్యత లేకపోవడం అంతకంటె పెద్ద దౌర్భాగ్యమనాలి. ఒక్కమన క్యాతలిక్ శాఖలోనే వున్న అంతఃకలహాలూ కులతత్వాలు మురాతత్వాలూ అన్నీ యిన్నీ కాదు. మరి యింతవరకు మనం వర్ణిస్తూ వచ్చిన సత్రసాదమూ, దాని శక్తి ఏ గాలికి పోయినట్లు? పౌలు క్రీస్తుతో ఐక్యమైనవాళ్ళల్లో జాతి భేదమూ లింగ భేదమూ వర్గభేదమూ వుండకూడదన్నాడు - గల 3.28. కాని మనం నిత్యజీవితంలో ఇన్ని విభేదాలకు గురౌతూన్నామంటే ఆ సత్రసాదం మనలో పనిచేయడం లేదనే చెప్పాలి కదా! మనం బయటికి క్రైస్తవులంగా కన్పించినా ఉత్థాన క్రీస్తూ అతని ఆత్మ లోలోపల మన హృదయాలను ఇంకా మార్చలేదనే చెప్పాలి కదా? ప్రస్తుతానికి ప్రభువు కనీసం ఈ దౌర్భాగ్యాన్ని గుర్తించే భాగ్యమైనా మనకు దయచేయాలని అడుగుకొందాం.

3.అగస్టీను భక్తులు ఈలా చెప్పాడు. "దివ్య సత్ర్పసాదం ప్రేమ సంస్కారం. ఐక్యతాచిహ్నం. సోదరప్రేమ సాధనం, పాస్కవిందు, దాని ద్వారా క్రీస్తుని భుజిస్తాం. మన హృదయం వరప్రసాదంతో నిండుతుంది. భవిష్యత్తులో మనకు ఉత్థానమూ మోక్ష మహిమా కూడా సిద్ధిస్తాయి." అగస్టీను పేర్కొన్న ఈ భాగ్యాలన్నిటినీ పొందాలని ప్రార్థద్దాం.