పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయచేసినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ కృతజ్ఞత ప్రధానంగా ఆరాధించడానికి ఉద్దేశించింది కాదు. మరి దివ్యబలితోను దివ్యభోజనం తోను మనకుండే సంబంధాన్ని పొడిగించుకొనేది.

కొందరు దివ్యసత్ప్రసాదబలె కృతజ్ఞతాబలికదా, పూజముగిసాక మళ్ళా ప్రత్యేకంగా కృతజ్ఞత సమర్పించు కోవడమెందుకు అంటారు. ఇది కుతర్కం. కొందరు ఈలా వాదించకపోయినా పూజ ముగియగానే గబాలున గుడిలో నుండి వెళ్ళిపోతారు. ఇది చెడ్డ పద్ధతి, పూజబలి కృతజ్ఞతాబలి అన్నమాట నిజమే. కాని ఈ కృతజ్ఞత క్రైస్తవ ప్రజా సమూహమంతా కలసి సమర్పించుకొనేది. దానితోపాటు మన వ్యక్తిగతమైన కృతజ్ఞత కూడ వుండాలి. దీన్ని పూజ ముగిసాక వ్యక్తిగతంగా సమర్పించుకోవాలి.

పూజల్లోవాడే ఓ ప్రార్ధనం “ఓ ప్రభూ! మేము నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం దయచేయి. ఏనాడూ నీ స్తుతిని మరచిపోకుండా వుండేలా అనుగ్రహించు" అని చెప్తుంది. కనుక పూజ ముగిసాక కొన్ని నిమిషాల పాటు గుళ్ళనే వుండి ప్రభువుకి వందనాలర్పించడం మంచి పద్ధతి.

5. రెండు రూపాల్లో సత్రసాదం

నేడు మన విశ్వాసులు మామూలుగా రొట్టెరూపంలోనే సత్రసాదాన్నిస్వీకరిస్తారు. చారిత్రకంగా జూస్తే తొలిరోజుల్లో రొట్టెరసాలనే రెండురూపాల్లోను ఈ ప్రసాదాన్ని పుచ్చుకొనేవాళ్లు, క్రీస్తు దీన్ని స్థాపించినపుడు ఈ రెండు రూపాల్లో స్థాపించాడు. నా శరీరం ఆహారం, నా రక్తం పానం అన్నాడు - యోహా 6,55. పౌలు ఈ రెండు రూపాలనూ పేర్కొన్నాడు - 1కొ 11:28, 12వ శతాబ్దం వరకు ఈ భోజనాన్ని సామాన్యంగా రెండు రూపాల్లోను అందించారు. కాని ఇదే కాలంలో దీన్ని అరుదుగా ఏకరూపంలో కూడ ఇచ్చేవాళ్ళు విశ్వాసులు రొట్టెరూపంలో వున్న దివ్యసత్ర్పసాదాన్ని మాత్రమే ఇండ్లకు తీసుకువెళ్ళి అక్కడ దాన్ని భుజించేవాళ్ళు గుళ్ళల్లో కూడ దివ్యసత్ర్పసాదాన్ని మాత్రమే పదిలపరచి వ్యాధిగ్రస్తులు మొదలైన వాళ్ళకు ఇచ్చేవాళ్ళ ఈ రొట్టెను భుజించలేని రోగులకు దివ్యరక్తాన్ని మాత్రమే ఇచ్చేవాళ్ళు.

13-15 శతాబ్దాల్లో ఈ విందుని ద్విరూపంలో గాక ఏకరూపంలోనే భుజించారు. విశ్వాసుల సంఖ్య పెరిగిపోయే కొద్దీ దివ్యరక్తాన్ని పంచి యీయడం కష్టమనుకొని దాన్ని ఆపివేసారు. అరుదుగా మాత్రం ఈ భోజనాన్ని ద్విరూపాల్లో ఇస్తుండేవాళ్ళు.

ఇక 16-20 శతాబ్దాల్లో చరిత్ర వేరు. 16వ శతాబ్దంలో ఆదిమశాఖ నుండి చీలిపోయిన ప్రోటస్టెంటు సంస్కరణ నాయకులు దివ్యసత్ర్పసాదాన్ని రెండు రూపాల్లోను ఈయాలన్నారు. అలా ఈయడం దైవశాసనమని వాదించారు. క్రీస్తు దీన్ని రెండు రూపాల్లో స్థాపించాడని ప్రమాణం చూపించారు. బ్రెంటు మహాసభ ఈ వాదాన్ని ఖంధించి