పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూజనూ జరుగనున్న పూజనూ జ్ఞప్తికి తెస్తుంది. పూర్వపు పూజలో ఆ సత్ర్పసాదం తయారయ్యింది. వచ్చే పూజలో దాన్ని మళ్ళా స్వీకరిస్తాం. అది ప్రధానంగా బలి, భోజనం. అది బలీ భోజనమూ కనుక, దానిలో దైవసాన్నిధ్యమంది కనుక, దాన్ని ఆరాధిస్తాం. అంతేగాని ఆరాధనమే ప్రధానాంశం గాదు. ముందే చెప్పినట్లు, దాన్ని భుజిస్తాం గనుక పదిలపరుస్తాం. పదిలపరచాం గనుక ఆరాధిస్తాం. కాని దాన్ని ఆరాధించడం కోసం పదిలపరచం.

అసలు మనం సత్ర్పసాదం సందర్శించేది ప్రధానంగా ఆరాధనం కొరకు గాదు. మన పీరాలమీద నెరవేరే పాస్మబలితో ఐక్యంగావడం కోసం. పూజబలి పాస్మబలిని తలపిస్తుంది. పాస్మబలి సిలువబలిలో నెరవేరింది. ఆ సిలువబలి నేటి పూజబలిలో కొనసాగుతుంది. కనుక మనం సత్ర్పసాదాన్ని సందర్శించేది పాస్క సిలువ బలులను స్మరించుకోవడం కోసం. సత్రసాద సందర్శనం ఇంతకు ముందే ముగిసిన పూర్వపు పూజను కొనసాగిస్తుంది. తర్వాత జరుగబోయే క్రొత్తపూజకు మనలను సిద్ధం జేస్తుంది. ఆ జరుగబోయే పూజలో దివ్యసత్రసాదాన్ని స్వీకరించడానికి మనలను తయారు చేస్తుంది.
సత్ర్పసాద సందర్శనం మనలను సత్ర్పసాదం స్వీకరించడానికి సిద్ధం చేసేలా వండాలి. ఈ సందర్భంలో ఆధ్యాత్మిక విధంగా సత్రసాదం తీసికోవడం అనే పద్ధతి ఎంతో ప్రయోజనకరమైంది. ఈ పద్ధతిలో సత్రసాదాన్ని యథార్థంగా భుజించం. భుజించాలని కోరుకొంటాం. ఈ కోరిక తరువాత పూజలో యథార్థంగా సత్రసాదం తీసికోడానికి మనలను సిద్ధం చేస్తుంది. సత్ర్పసాద సందర్శనం ప్రయోజనం కూడ యిదే. కనుక మనం సత్రసాదాన్నిసందర్శించినపుడెల్ల ఆధ్యాత్మికంగా 39 భోజనాన్ని స్వీకరించడం ఉత్తమం.
సత్రసాద సన్నిధిలో ఆరాధనం, కృతజ్ఞత, మనవి, పాపపరిహారం కొరకు వేడుకోవడం మొదలైన భక్తిభావాలను కూడ ప్రదర్శించవచ్చు.
కాని క్రీస్తు సత్రసాద మందసంలో బంధింపబడి వున్నాడనీ, అతన్నిఓదార్చడానికి మనం అతని సన్నిధిలోనికి వెళ్తున్నామనీ అనుకోవడం వట్టి పిచ్చి భావం. ఉత్థాన క్రీస్తు నేడు మహిమతో విరాజిల్లేవాడు కాని బాధలకు గురయ్యేవాడు కాదు. కనుక మనం

అతన్ని ఓదార్చం, అతడే మనలను ఓదారుస్తాడు.