పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రతిమాలుకొనుచున్నాము" అని చెప్తాం. ఈ ప్రార్థనకు ఆత్మ ఆవాహనం అని పేరు. ఈ యావాహనం ద్వారా పీఠం మీదికి దిగివచ్చే ఆత్మా ఇది నా శరీరం ఇది నా రక్తం అనే క్రీస్తు వాక్కూరెండూ కలసి రొట్టెరసాలను మారుస్తాయి.

3. సాన్నిధ్యం ఎంతకాలముంటుంది?

దివ్యసత్ర్పసాదంలో దైవసాన్నిధ్యముందని చెప్పాం. కాని ఈ సాన్నిధ్యం ఎంతకాలముంటుంది? ప్రోటస్టెంటు సంస్కరణ నాయకులు మనం ఆరాధనంలో దివ్యసత్ర్పసాదమూ దివ్యభోజనమూ పుచ్చుకొనేపుడు మాత్రమే వాటిల్లో దైవసాన్నిధ్యం వుంటుందన్నారు. ఆరాధనం ముగిసాక ఇక ఆ సాన్నిధ్యం అంతరిస్తుందన్నారు. కనుక ఆరాధనం లేక పూజ ముగిసాక దివ్యసత్ర్పసాదాన్ని పదిల పరచకూడదన్నారు. అలా పదిలపరచిన సత్రసాదాన్ని ఆరాధించగూడదు, దాన్ని ప్రదక్షిణల్లో తీసికొని పోకూడదు, అని నుడివారు. అలా చేస్తే విగ్రహారాధనం చేసినట్లే నన్నారు, ఇంకా, దాన్ని రోగులకు ఆహారంగా ఈయకూడదని కూడ వాదించారు.

ట్రెంటు మహాసభ ఈ వాదనలన్నిటినీ ఖండించి ఈలా బోధించింది. పూజ ముగిసాక గూడ దివ్య శరీర రకాలలో క్రీస్తు సాన్నిధ్యం వుంటుంది. ఆ రెండిటిల్లోను, వాటిల్లోని ప్రతి కణంలోను గూడ ప్రభువు శరీరమూ ఆత్మా దివ్యత్వమూ - అనగా పూర్ణక్రీస్తు నెలకొని వుంటాడు. కనుక దాన్ని ఆరాధించవచ్చు, ఆరాధించాలి కూడ. అగస్టీను భక్తుడు నుడివినట్లు "మొదట ఆరాధించకుండా ఎవడూ ఈ దివ్యసత్రసాదాన్ని భుజించడు. దాన్ని ఆరాధించడం వల్ల గాదు, ఆరాధించక పోవడం వల్ల పాపం కట్టుకొంటాం.” ఇక దీన్ని రోగులకు ఆహారంగా కూడ పంచిపెట్టవచ్చు. ఇది శ్రీసభ సనాతన సంప్రదాయం.

4. సాన్నిధ్య స్వభావం

దివ్యసత్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యముంటుందని చెప్పాం. ఈ సాన్నిధ్యం ఏలా వుంటుంది? సాన్నిధ్యం పలు విధాలుగా వుంటుంది. మొదట స్థానికమైన సాన్నిధ్యముంది. రెండు కుర్చీలు ఒక తావులో ఒకదాని ప్రక్కన ఒకటి వున్నాయి. ఈ వస్తువులు ఒకదానితో ఒకటి కలవవు, ఒకదాన్నొకటి అర్థం చేసికోవు. ఇది స్థానికమైన సాన్నిధ్యం లేదా వస్తు సాన్నిధ్యం. ఒకోమారు నరులు కూడ ఈలాగే వుంటారు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు బస్సులో ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. ఐనా వాళ్ళ ఒకరితో ఒకరు కలియరు. ఇది కేవలం వస్త సాన్నిధ్యం, జడాత్మకమైంది కనుక దీనికి ఏ విలువా లేదు.

ఇది కాక వ్యక్తిగతమైన సాన్నిధ్యం కూడ వుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసికొంటూ అంగీకరిస్తూ వుంటారు. ప్రేమతో ఒకరినొకరు