పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్ని దిగివచ్చిందని వింటున్నాం. క్రీస్తు వాక్కులో మాత్రం అలాంటి శక్తి లేదా? ఆ వాక్కు భౌతిక వస్తువులను మార్చలేదా? సృష్టి వస్తువులను గూర్చి "దేవుడు ఒక మాట పలుకగా అవి ఉద్భవించాయి, అతడు ఆజ్ఞాపించగా అవి పుట్టాయి" అని చదువుతూన్నాం. ఉనికిలో ತೆ: వస్తువులను సృజించగల దైవవాక్కు ఈవరకే వున్న వస్తువులను ఇతర వస్తువులనగా మార్చలేదా? లేని దానిని సృజించడం కంటె ఉన్నదానిని మార్చడం సులభం కాదా? ప్రభువు ఇది నా శరీరం అని వాక్రుచ్చాడు. ఆ మాటలు పలకకముందు అది కేవలం భౌతిక వస్తువైన రొట్టె కాని ఆ మాటలు పలికాక అది క్రీస్తు శరీర మవుతుంది."

మొదట దైవవార్త మన మంటిమీదికి దిగివచ్చి మన మానవాకృతిని చేకొంది. క్రీస్తు దేవుడై కూడ నరరూపంలో ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా ఆ దైవవార్త మన పీఠాల మీదికి దిగివచ్చి రొట్టెరసాల ఆకృతిని చేకొంటుంది. ఆనాడు నరుడుగా సాక్షాత్కరించిన వార్త ఈనాడు మళ్ళా రొట్టెరసాలుగా గూడ సాక్షాత్కరిస్తుంది. ఆ నరావతారంలోని శరీరరక్తాల్లో వున్న దేవుడే ఈ రొట్టెరసాల్లో గూడ వుంటాడు. దేవుడు ఓ మారు మన భౌతిక వస్తువుల్లోకి ప్రవేశించడం మొదలెట్టాక అది నరావతారమైనా ఒకటే రొట్టెరసాల రూపమైనా ఒకటే.

లూతరు మొదలైన ప్రోటస్టెంటు నాయకులు ఆరాధనం జరిగేప్పడు దివ్యసత్రసాదంలో దైవసాన్నిధ్యం వుంటుందని వొప్పుకొన్నారు. కాని రొట్టెరసాల స్వభావం మాత్రం మారదన్నారు. రొట్టె రొట్టెగానే వుంటుంది, రసం రసంగానే వుంటుంది అన్నారు. ట్రెంటు మహాసభ ఈ వాదాన్ని ఖండించింది. నడిపూజ ముగిసాక రొట్టెరసాలు ఇక వుండవనీ, వాటి స్థానే ఉత్థాన క్రీస్తు నెలకొంటాడనీ ఆ సభ బోధించింది.

ఉత్తాన క్రీస్తు చిత్తం వల్లనే నడిపూజలో రొట్టె రసాలు అతని శరీర రకాలుగా మారుతున్నాయి. ఈలా మారడంలో పరిశుద్దాత్మ ప్రమేయం కూడ వుంది. క్రీస్తు ఉత్తానమైంది ఆత్మ శక్తిద్వారా - రోమా 8,11. క్రీస్తుని ఉత్తానం చేసిన ఆ పరిశుద్దాత్మే అతని ఉత్తాన శరీరమైన దివ్యసత్రసాదంలో కూడ పనిచేస్తుంది. కనుక ఆత్మశక్తి వల్ల కూడ రొట్టెరసాలు ప్రభువు శరీర రకాలుగా మారతాయి.

ఆత్మ చేసే పని రొట్టె రసాలను మార్చడం మాత్రమే కాదు, క్రైస్తవ ప్రజలను ఆరాధనకు ప్రోగు జేయడం గూడ. ఆ యాత్మ శక్తి వల్లనే మనమందరమూ ప్రభువు పీఠం చుటూ సమావేశమవుతాం. ప్రభువు శరీరరకాలను ఆరాధించి ఆరగిస్తాం. ఆత్మ లేందే ఆరాధనం లేదు. ఈలా రొట్టెరసాలను మార్చడంలోను, అలా మారిన దివ్యపదార్థాలను మనం స్వీకరించేలా చేయడంలోను ఆత్మ సహాయం కూడ వుంటుంది. అందుకే మనం పూజలో ఈ యాత్మ అప్పరసాల మీదికి దిగివచ్చి వాటిని మార్చాలని ప్రార్ధిస్తాం. "కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ మని