పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక ఇక్కడ దివ్యసత్రసాదం సోదర ప్రేమను పాటించని ఈ సంపన్నులను ఈలా శిక్షించిందంటె దానిలో ఏదో శక్తి వుందనే అనుకోవాలిగదా! పాలు దానిలో దైవసాన్నిధ్యముందనే భావించాడు అనుకోవాలి కదా!

2. ఇంకో సందర్భంలోగూడ పౌలు దివ్యసత్రసాదంలో అద్భుతశక్తి వుందని చెప్పాడు. తొలిరోజుల్లో పూజలో ఒకే పెద్ద రొట్టెను ఆశీర్వదించేవాళ్లు, దాన్నే ముక్క ముక్కలుగా త్రుంచి పూజలో అందరికీ దివ్యసత్రసాదంగా పంచిపెట్టేవాళ్లు ఈ యాచారాన్ని మనసులో పెట్టుకొనే పౌలు “మనం విరిచే రొట్టెలో పాలుపొందేవాళ్లంతా క్రీస్తు శరీరంలో పాలు పొందుతారు" అన్నాడు. ఇంకా అతడు “ఒక్క రొట్టెలో పాలు పొందేవాళ్ళంతా ఒక్క శరీరంగా ఏర్పడతారు" అన్నాడు - 1కొ 10,16-17. ఇక్కడ రొట్టె అంటే దివ్య సత్రసాదమే. ఈ దివ్య సత్రసాదంలో పాలుపొందే వాళ్ళంతా క్రీస్తు శరీరమవుతారు. అనగా అతనితో ఐక్యమౌతారు. ఇంకా ఈ యొకే రొట్టెరూపంలోవున్న దివ్యసత్రసాదంలో పాలుపొందే వాళ్ళంతా తమలో తాము ఐక్యమౌతారు. అనగా వాళ్ళు శ్రీసభ ఔతారు. ఈ వాక్యాలను బట్టి మనలను క్రీస్తుతోను తోడి ప్రజలతోను ఐక్యపరచేశక్తి దివ్యసత్ర్పసాదానికి వందనుకోవాలి. ఆ శక్తి దానికేలా వచ్చింది? దైవసాన్నిధ్యం వల్లనే గదా?

3. యోహాను సువార్తలో క్రీస్తు "నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానంజేసేవాడు నిత్యజీవం పొందుతాడు. నేనతన్ని అంత్యదినాన లేపుతాను" అన్నాడు – 6, 54. మనకు జీవమిచ్చే అద్భుత శక్తి ఈ భోజనానికుంది. ఈ సామర్థ్యం దానికేలా వచ్చింది? దైవసాన్నిధ్యంవల్లనేగదా?

ఈలా దివ్యసత్రసాదంలో దైవ సాన్నిధ్యముందని ప్రత్యక్షంగా గాకపోయినా పరోక్షంగానైనా నిరూపించే వాక్యాలు నూతవేదంలో చాలా వున్నాయి.

2. రొట్టె రసాలు ఏమవుతాయి?

మీద దివ్యసత్ర్పసాదంలో దైవసాన్నిధ్యముంటుందని చెప్పాం. ఈ సాన్నిధ్యం దానిలోకి ఏలూ వచ్చింది? మొదట వున్న రొట్టెరసాలు ఏమయ్యాయి? నడిపూజలో గురువు రొట్టెరసాలను ఆశీర్వదించి ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పగానే ఆ వస్తువులు రెండు మారిపోతాయి. వాటిస్థానే క్రీస్తు శరీరరక్తాలు నెలకొంటాయి. అనగా రొట్టె రసాల స్వభావం మారిపోయి వాటిలో ఉత్తాన క్రీస్తు నెలకొంటాడు. బయటికి మాత్రం రొట్టె రసాల రుచి రూపం మొదలైన గుణాలు కన్పిస్తూనే వుంటాయి. కాని ఆ వస్తువుల స్వభావం మారిపోయి వాటిల్లో క్రీస్తు శరీరరకాలు నెలకొన్నాయని నమ్ముతాం. ఈ యంశాన్నే భక్తుడు • ఆంబ్రోసు ఈలా వివరించాడు : “పూర్వం ఏలీయా ప్రవక్త వాక్కుద్వారా ఆకాశం నుండి