పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుకి బదులు ఇస్తాడు. గురువు అంతస్తు అంత వున్నతమైంది. కనుక ఈ యంతస్తుకి తగినట్లుగా గురువు భక్తిమంతమైన జీవితం జీవించాలి, యోగ్యంగా బలినర్పించాలి. గురువు అపవిత్రత వలన పూజబలి ఫలితాలు కుంటువడి పోతాయని ముందే చెప్పాం.

రెండవభాగం - దివ్యసత్ర్పసాద సాన్నిధ్యం

7. దివ్యసత్ర్పసాదంలో క్రీస్తు సాన్నిధ్యం

మనం విరిచే రొట్టెను భుజించేవాళ్ళంతా క్రీస్తు శరీరంలో పాలుపొందడం లేదా? - 1కొరి 10,16.

మొదటి భాగంలో దివ్యసత్రసాదంలో క్రీస్తుని బలిగా అర్పిస్తామన్న అంశం చూచాం. ఇక్కడ దివ్యసత్రసాదంలో క్రీస్తు ప్రత్యక్షమై యుంటాడు అన్నవిషయం చూడాలి. నడిపూజలో రొట్టెరసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారిపోతాయి అన్న సత్యాన్ని బాగా అర్థంచేసికోవాలి. ప్రస్తుతం నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. సత్ర్పసాద సాన్నిధ్యం

పూర్వవేదంలో ప్రభువు యిప్రాయేలు ప్రజలమధ్య నెలకొని వుండేవాడు. ఈ దైవసాన్నిధ్యం విశేషంగా కొన్ని పరికరాల్లో వుండేది.

1. సాన్నిధ్యపు గుడారం. ఎడారికాలంలో యూదులు గుడారంలో ప్రభువుని సేవించుకొన్నారు. ఆ ప్రభువు ఈ గుడారంలోనుండి ప్రజలతో మాటలాడేవాడు - నిర్గ 29,42. దీనిలోనుండే అతడు మోషేతో, నేరుగా స్నేహితుడు స్నేహితునితో మాటలాడినట్లుగా, మాటలాడేవాడు - 33, 11.
2. మేఘం. ప్రభువు మేఘంలోగూడ ప్రత్యక్షమవుతుండేవాడు. ఈ మేఘం పై గుడారాన్ని కప్పతుండేది. దానిలో ప్రభువు తేజస్సు ఉండేది - నిర్గ 33, 9-10, 40, 34-35. యూదులు ఎడారిలో నలభైయేండ్లు ప్రయాణం చేసారు. ఈ నలభైయేండ్ల కాలమూ పై మేఘం వారికి దారి జూపుతూ వచ్చింది. అది పగటిపూట పొగస్తంభం లాగాను, రాత్రిపూట నిప్పస్తంభంలాగాను కన్పించేది.

3. మందసం. యిస్రాయేలీయులు పది ఆజ్ఞలు వ్రాసిన రాతిపలకలను ఓ పెట్టెలో పెట్టుకొని ఆ పెట్టెను తమవెంట మోసికొని పోతుండేవాళ్ళు. ఇదే మందసం. దీని మీద బంగారు రేకును పొదిగారు, ఈ రేకునకు కరుణాఫలకం అని పేరు. దీనిమీద