పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పొందుతాం అనే అంశాన్ని మాత్రం నిరాకరించారు. లూతరు భావాల ప్రకారం మనకు పాపపరిహారం చేసిపెట్టింది కల్వరి బలి. మరి పూజవల్ల పాపపరిహారం జరిగితే కల్వరిబలి నిరర్థకమైపోయినట్లే, కనుక పూజ పాపపరిహారం చేయలేదు. క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు పాపక్షమాపణం కలుగుతుంది. పూజ ప్రధానంగా కృతజ్ఞతాబలి అంతే. అందుచేత మృతుల పాపపరిహారం కొరకు పూజలు అర్పించడం . బ్రెంటు మహాసభ ఈ వాదాన్ని ఖండించి పూజ వలన పాపపరిహారాన్ని పొందవచ్చునని బోధించింది. నిష్ప్రయొజనమ అర్పించడం వల్ల మనం పాపాలకు పశ్చాత్తాప పడతాం. ఆ పాపాలను దేవుని యెదుట ఒప్పకొని పాపసంకీర్తనం చేస్తాం. ఈలా పూజద్వారా చావైన పాపాలకుకూడ పశ్చాత్తాపపడి పరిహారం పొందవచ్చు. పూజలో మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తునే అర్పిస్తాం. ఆ ప్రాయశ్చిత్తమూర్తి మన హృదయంలో పశ్చాత్తాపం పుట్టించి మనకు పరిహారం సంపాదించి పెడతాడు. పూజ కల్వరిబలికంటె భిన్నమైంది కాదు కనుక, ఆ బలిని మన మధ్యలో కొనసాగించేది కనుక, దాని ద్వారా కూడ పాపపరిహారం పొందవచ్చు. ఇక మృతుల కొరకు అర్పించిన పూజ ఆ మృతుల పాపాలకు పరిహారం చేస్తుంది. ప్రాచీనకాలం నుండీ శ్రీసభ వీళ్ళ కొరకు పూజలు అర్పించడం అనే ఆచారాన్నిపాటిస్తూ వచ్చింది. కనుక దీనిలో దోషమేమీ లేదు.

3. పూజనుండి పూర్తి ఫలితాన్ని పొందుతామా?

పైన పూజద్వారా నాలు ఫలితాలను పొందుతామని చెప్పాం. కాని వాటిని ప్రస్తుతం ఎంతవరకు పొందుతాం? అది మన భక్తిభావాన్ని బట్టి వుంటుంది. పూజలో రెండంశాలున్నాయి. మొదటిది, క్రీస్తుని బలిగా అర్పిస్తాం. రెండవది, శ్రీసభ, అనగా మనం పూజను అర్పిస్తాం. క్రీస్తుని బలిగా అర్పించడాన్ని బట్టి చూస్తే, పై ఫలితాలు సిద్ధించి తీరాలి. తండ్రికి క్రీస్తు అత్యంత ప్రీతిపాత్రుడు కనుక ఇక్కడ లోటు ఏమీ వుండదు. కాని శ్రీసభ బలిని అర్పించడాన్ని బట్టిచూస్తే పై ఫలితాలు పూర్తిగా సిద్ధించకపోవచ్చు మనం భక్తితో పూజను అర్పిస్తే ఫలితం కలుగుతుంది, లేకపోతే లేదు. తరచుగా మన భక్తిలో లోటు వుంటుంది. మన పాపపు నరులం. మన హృదయంలో వుండవలసినంత దేవప్రేమా సోదరప్రేమా వుండవు. ఈలాంటి అపవిత్ర హృదయంతో, బలినర్పిస్తే ඡායි భగంతునికి అట్టే ప్రియపడదు కదా! కనుక అపవిత్ర నరులు అర్పించే పూజబలి పై ఫలితాలను సమృద్ధిగా సాధించి పెట్టలేకపోవచ్చు. అందుచేత సమర్పింపబడే క్రీస్తుని బట్టి కాదు గాని, సమర్పించే శ్రీసభను బట్టి పూజఫలితాల్లో కొరత వుంటుంది. 35