పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవది కృతజ్ఞత తెల్చుకోవడం. పూర్వవేదంలో యావే చేకూర్చిపెట్టిన దాస్యవిముక్తికి యిప్రాయేలీయులు అతనికి వందనాలర్పించారు. నూతవేదంలో పాపవిముక్తికి మనం క్రీస్తుకి నమస్కారాలు చెప్తాం, ఆరాధనకీ కృతజ్ఞతకీ తేడా వుంది. ఆరాధనంలో ఆ ప్రభువు కోసమే అతన్ని స్తుతిస్తాం, పాస్క పండుగ సమయంలో హీబ్రూ ప్రజలు బెరకా అనే స్తుతి ప్రార్ధనం చేసేవాళ్ళని చెప్పాం. ఆ ప్రార్ధనంలో ఆరాధనమూ కృతజ్ఞతా ప్రధానాంశాలు. నూత్నవేదంలో దివ్యసత్రసాదానికి ప్రత్యేకంగా "కృతజ్ఞతాస్తుతి" అనే పేరుందని గుర్తుంచుకోవాలి.

మూడవ ఉద్దేశం పాపపరిహారం పొందడం. పూర్వవేదంలో యూదులు కిప్పూర్ అనే ప్రాయశ్చిత్త దినాన పాపపరిహారబలిని సమర్పించేవాళ్ళని చెప్పాం. దాని ఫలితంగా ప్రభువు ఆ ప్రజల పాపాలను క్షమించాడు. నూతవేదంలో మనం కూడ పూజబలి మూలంగా క్రీస్తునుండి పాపపరిహారం పొందుతాం. మరోలా చెప్పాలంటే మనమర్పించే క్రీస్తుని చూచి తండ్రి మన పాపాలను క్షమిస్తాడు. నూత్నవేదం చాల తావుల్లో ఆ క్రీస్తు మనకు పాపపరిహారమని చెప్పంది.

పూర్వవేదంలో మందసంమీది బంగారు పలకకు కరుణాఫలకం అని పేరు. ఈ ఫలకం మీద రెండు దేవదూతల బొమ్మలుండేవి. ఈ బొమ్మల మధ్యగల ఖాళీస్థలంలో దేవుని సాన్నిధ్యముండేది. దీన్నే యూదులు షెకీనా అని పిల్చారు. ఇక కిప్పూరు ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు గర్భాగారంలోకి వెళ్ళి ఈ కరుణా ఫలకం మీద పశువుల నెత్తురు చిలకరించేవాడు. దానివల్ల పాపపరిహారం జరిగింది — లేవీ 16, 14 నూత్నవేదం రెండుతావుల్లో క్రీస్తు మన కరుణాఫలకం అని చెప్తుంది - 1యోహా 4,10. రోమా 3,27. అనగా అతడు మన పాపాలను తొలగించేవాడని భావం.

నాల్గవ ఉద్దేశం మనకు కావలసిన పరప్రసాదాలను అడుగుకోవడం. పూర్వవేదంలో ప్రజలు పాపపరిహారబలి నర్పించినందున ప్రభువు ప్రసన్నుడయ్యేవాడు. అప్పడు వాళ్లు ఆ ప్రభువు నుండి తమకు కావలసిన వరాలను అడుగుకొనేవాళ్లు, ఆ ప్రభువు పూర్వం పితరులకు చేసిన వాగ్దానాలను అతని గుర్తుకి తెచ్చేవాళ్ళ అతడు అబ్రాహాము ఈసాకు మొదలైన పితరులకు మాట యిచ్చినట్లే తమ్ము కాచికాపాడాలని మనవి చేసికొనేవాళ్లు ఈలాగే మనంకూ డ నూతవేదపు పూజబలిలో క్రీస్తునుండి వరాలు అడుగుకొంటాం. అతడు మన అక్కరలను తీర్చాలని వేడుకొంటాం.

2. పూజవల్ల పాపపరిహారం పొందుతామా?

ప్రోటస్టెంటు సంస్కరణ నాయకులు ఆరాధన, కృతజ్ఞత, మనవి అనే వద్దేశాలతో పూజబలి నర్పించవచ్చునని అంగీకరించారు. కాని పూజద్వారా పాపపరిహారాన్ని