పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4. జ్ఞానస్నానం పొందిన ప్రజలను "దేవునికి అంగీకార యోగ్యమూ ఆధ్యాత్మికమూ ఐన బలులర్పించే పరిశుద్ధ యాజకులు" అని పేర్కొంటుంది మొదటి పేత్రు జాబు 2,5. పూర్వం యెరూషలేం దేవళంలో పశుబలులర్పించారు. అవి భౌతికమైనవి. వాటితో బోలిస్తే నూత్నవేదబలి ఆధ్యాత్మికమైంది. పూర్వవేదబలులు దేవునికి ఎంతవరకు ప్రియవడ్డాయో మనకు తెలియదు. కాని ఈ నూత్నవేద బలిలో క్రీస్తునే అర్పిస్తాం గనుక ఇది తండ్రికి అంగీకార యోగ్యమైన బలి. ఈలాంటి పూజబలిలో గృహస్థలు ఉత్సాహంతోను భక్తిభావంతోను పాల్గొనాలి.

5. నూత్న దేవాలయాన్ని ఆశీర్వదించేపుడు దానిలోని పీఠానికి ప్రతిష్ట చేసే ప్రార్ధనం ఒకటుంది. “ఈ పీఠం మీద నిర్మలత్వం పెంపుజెందుగాక. గర్వం బలి యిూయబడును గాక, కోపం సంహరింపబడును గాక. కామమూ దురాశా మట్టపెట్టబడును గాక, దీనిమీద పావురాళ్ళు గాక పవిత్రతా బ్రహ్మచర్యమూ బలిగావింపబడును గాక". మనం పూజబలి నర్పించే పీఠానికి ఇంత పావిత్ర్యమూ వుంది. క్రీస్తు బలిని బట్టే దానికి ఈ పాబ్రిత్యం సిద్ధించింది.

6. పూజబలి ఫలితాలు

“మన పాపాలకోసం చనిపోయిన క్రీస్తునే మనం పూజబలిలో అర్పిస్తాం. అలా అర్పింపబడిన క్రీస్తుని చూచి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు".

                                                      - సిరిల్ భక్తుడు 

పూజబలి ఉద్దేశాలు నాలున్నాయి. అనగా పూజను అర్పించడం వల్ల మనం నాలు ఫలితాలను సాధిస్తాం. మన తరపున మనం భక్తిభావంతో పూజను అర్పించి ఈ ఫలితాలన్నిటినీ పొందుతూండాలి. ఈ యధ్యాయంలో మూడంశాలు విచారిద్దాం.

1. నాలు ఫలితాలు

పూజను నాలు ఉద్దేశాలకోసం అర్పిస్తాం. మొదటిది దేవుణ్ణి ఆరాధించి స్తుతించటం కోసం. పూర్వం యూదులు ప్రభువు తమ్ము ఐగుప్న దాస్యంనుండి విడిపించినందుకు అతన్ని కొండాడారు. పాస్మోత్సవం చేసికొన్నారు. ఆ వుత్సవంలో అతన్ని స్తుతించి కీర్తించారు. అలాగే నూత్నవేదంలో మనం మరో దాస్యవిముక్తిని స్మరించుకొని క్రీస్తుని స్తుతిస్తాం. ఈ ప్రభువు పిశాచ దాస్యం నుండి మనలను విడిపించాడు. కనుక పూజబలిలో అతన్ని ఆరాధించి కీర్తిస్తాం.