పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగినపుడెల్లా తమ పీఠాధిపతి తమ గురువులందరితో కలసి సమర్పించే సంయుక్తపూజలో పాల్గొని విశేష లాభం పొందుతూండాలి.

5. స్థానిక శ్రీసభ, విశ్వశ్రీసభ

మనం స్థానిక శ్రీసభలో పూజను సమర్పించినా ఆ పూజ ఓ విధంగా విశ్వశ్రీసభకు చెందిందవుతుంది. ప్రతిపూజనీ శ్రీసభ అంతా సమర్పించినట్లవుతుంది. ఎందుకంటే పూర్తి శ్రీసభ స్థానిక శ్రీసభలో ఇమిడివుంటుంది. కనుక స్థానికపూజ విశ్వశ్రీసభ పూజ అవుతుంది. ఇంకా గురువు శ్రీసభ కంతటికీ ప్రతినిధిగా వుంటాడు. కనుక అతని పూజ శ్రీసభ కంతటికీ సంబంధించింది అవుతుంది. అంటే మనం చేసే ప్రతి పూజలోను పరోక్షంగా శ్రీసభ అంతా పాల్గొంటుంది అని చెప్పాలి.

కాని శ్రీసభకు చెందని క్రైస్తవేతరుల సంగతి యేమిటి? వాళ్ళకు జ్ఞానస్నానం లేదు. కనుక వాళ్లు క్రీస్తులోకి ఐక్యంగారు. అందుచేత వాళ్లు పూజబలిని అర్పించలేరు. కాని మనం వాళ్ళకొరకు పూజబలి నర్పించవచ్చు. పౌలు మనం మనుష్యలందరికొరకు ప్రార్థన లర్పించాలి అన్నాడు -1తి మొు 2,1. ప్రార్థనలర్పించిన వాళ్ళకొరకు బలులుకూడ అర్పించవచ్చు. కావున క్రైస్తవేతరుల కొరకు పూజనర్పించవచ్చు.

ఇక ప్రోటస్టెంటుల సంగతేమిటి? మన గురువులు వాళ్ళ గురువులతో కలసి బలినర్చించవచ్చా? ప్రోటస్టెంటు శాఖీయుల్లో అపోస్తలుల నుండి వరుసక్రమంలో యాజకత్వం పొందుతూ వచ్చినవాళ్ళున్నారు. అలా పొందనివాళ్ళు కూడ వున్నారు. మన గురువులు మొదటివర్గం వాళ్ళతో కలసి పూజబలి నర్పించవచ్చు.

6. సంయుక్త పూజ

చాలమంది గురువులు కలసి చేసే పూజబలి సంయుక్త పూజబలి. వీళ్ళల్లో ఒక్క ?ல்ல்ல் ಮಿನ್ಗಿ గురువుగా వుంటాడు. అతనికి పూజలో ప్రముఖస్థానం వుంటుంది. రెండవశతాబ్దం నుండే ఈలాంటి బలి శ్రీసభలో వాడుకలోవున్నట్లు తెలుస్తుంది. కాని తొలిరోజుల్లో ముఖ్య గురువు ఒక్కడు మాత్రమే నడిపూజలో అప్పరసాలను ఆశీర్వదించే వాక్యాలను పెద్దగా ఉచ్చరించేవాడు. తతిమ్మా గురువులు మౌనంగా వుండేవాళ్ళు, 7వ శతాబ్దం నుండి సంయుక్త పూజను చేసే గురువులందరూ ఈ వాక్యాలను పెద్దగా ఉచ్చరించడం ప్రారంభించారు. నేడు గురువులందరూ ఈ వాక్యాలను పెద్దగా ఉచ్చరించటం విధి,

ఈ పూజవల్ల మూడు లాభాలున్నాయి. 1. గురువులెందరైనా పూజ ఒక్కటేననే భావం కలుగుతుంది. 2. గురుత్వం ఒక్కటేనని ఆవొక్క సంస్కారంలో చాలమంది గురువులు