పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 90వ కీర్తనను ఆధారంగా తీసికొని నరుడు తన ప్రూస్వకాలిక జీవితాన్ని జూచి జ్ఞానం తెచ్చుకోవాలి అనే సూత్రాన్ని విశదీకరించండి.
11 “దేవుని నిర్వచనం కరుణే" - 103వ కీర్తనం నుండి ఈ సత్యాన్ని నిరూపించండి.
12 నేడు మనం ఈ లోకప్రలోభాల నుండి తప్పకోవడానికి 73వ కీర్తన ఏలా తోడ్పడుతుంది?
13 నూరవ కీర్తన పేర్కొనే దైవలక్షణాలను ఆరింటిని తెలియజేయండి.
14 91వ కీర్తనం మనం దేవునిపట్ల నమ్మకం పెంపొందించుకోవడానికి ఏలా ఉపయోగపడుతుంది?
15 8వ కీర్తన వర్ణించే నరుని గొప్పతనాన్ని తెలియజేయండి.
16 22వ కీర్తనలో రచయిత తన్ను గూర్చి చెప్పకొనిన శ్రమలు క్రీస్తుకేలా అన్వయిస్తాయో వివరించండి.
17 95వ కీర్తన దేవుని ఆజ్ఞలను పాటిస్తూ అతనిపట్ల విశ్వాసం కలిగివుండండని హెచ్చరించే తీరును వివరించండి.
18 30వ కీర్తనను ఆధారంగా తీసికొని నరుడు అహంకారాన్ని విడనాడి వినయాన్ని అలవర్చుకోవాలి అనే నీతిని వివరించండి.
19 యాత్రిక కీర్తనల లక్షణాలను పేర్కొనండి. యాత్రికునికి చేతికర్ర ఉపయోగపడినట్లే ఈ జీవితయాత్రలో 121వ కీర్తన మనకు ఏలా ఉపయోగపడుతుందో తెలియజేయండి.
20 దైవసహాయాన్ని గూర్చీ సంతాన భాగ్యాన్నీ గూర్చీ 127వ కీర్తన పేర్కొనిన సంగతులను తెలియజేయండి.
21 128వ కీర్తన వర్ణించే సంసార జీవితాన్నీ సంసారభక్తినీ విశదీకరించండి.
22 131వ కీర్తన గర్వాన్ని అణచుకొని వినయాన్ని అలవర్చుకోవాలని ఏలా బోధిస్తుందో తెలియజేయండి.
23 133వ కీర్తన పేర్కొనే ఐక్యతాభావాన్ని వివరించండి.
24 104వ కీర్తన చెప్పిన భక్తుడు ప్రకృతిలో దేవుణ్ణి దర్శించిన తీరును వివరించండి. ఈ కీర్తన సహాయంతో నేడు మనం ప్రకృతిలో దేవుణ్ణి ఏలా ధ్యానించుకోగలమో తెలియజేయండి.
25 ఏ కీర్తననైనాసరే తీసికొని దానిని నీవేలా ప్రార్థనకు వాడుకొన్నావో, దానివలన భగవంతుడు నీకేలా అనుభవానికి వచ్చాడో వివరించి చెప్ప.