పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/329

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పేరిట చెప్పే జపంలోకూడ వస్తుంది. దేవుడు మనకు భౌతిక జీవాన్నేగాక, పవిత్రాత్మద్వారా ఆధ్యాత్మికమైన నూత్నజీవాన్ని కూడ యిచ్చాడు. ఈ జీవం జ్ఞానస్నానంతో ప్రారంభమౌతుంది. ఈలా ఆత్మద్వారా మనం పొందిన నూత్నజీవాన్ని - వరప్రసాద జీవాన్ని - మనం రోజురోజుకీ పెంపొందించుకొంటూ పోవాలి.

5.రచయిత ప్రకృతిలోని వింతలకు విస్తుపోయి దేవుణ్ణి స్తుతించాడు. అతనిమిూద కీర్తన రచించాడు. దేవుడు తన కీర్తనను భక్తులు దేవళంలో అర్పించే ధాన్యబలిగా అంగీకరిస్తాడని ఆశించాడు (34). మనంకూడ ప్రకృతిలో దేవుణ్ణి ధ్యానించుకొని స్తుతించవచ్చు. ఆ స్తుతిని ఓ ధాన్యబలిలాగ ప్రభువుకి అర్పించవచ్చు. ఈ కీర్తననే భక్తితో జపించి ఓ చిన్న పూవులాగ ప్రభువు పాదాలచెంత అర్పించవచ్చు.

ప్రశ్నలు

1.ఒకటవ కీర్తన వర్ణించే రెండు త్రోవలను విశదీకరించండి.
2.23వ కీర్తన వ్రాసిన భక్తుడు భగవంతుణ్ణి కాపరిగాను, ఆతిథ్యకారుణ్ణిగాను వర్ణించడంద్వారా వెల్లడిచేసిన దైవానుభూతిని వివరించండి.
3.51వ కీర్తనలోని పశ్చాత్తాప భావాలను తెలియజేయండి.
4."నేనర్పించే బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే" - 51.17. ఈ పలుకుల భావమేమిటి?
5.జ్ఞానకీర్తనలు, విశ్వాసకీర్తనలు, విలాప కీర్తనలు - వీటి లక్షణాలను తెలియజేయండి.
6.స్తుతిగీతాలు, కృతజ్ఞతా కీర్తనలు - వీటి లక్షణాలను తెలియజేయండి. ఈ రెండు వర్గాలకు వ్యత్యాసమేమిటి?
7.113వ కీర్తనం ప్రకారం ప్రభువు దీనులను ఆదరించే తీరును తెలియజేయండి.
8.32వ కీర్తన చెప్పిన భక్తుని పాపానుభవాన్నీ అతడు భావితరాల వాళ్ళకు చేసిన ఉపదేశాన్నీ పేర్కొనండి.
9.139వ కీర్తన చెప్పిన భక్తుడు దైవసాన్నిధ్యాన్ని వర్ణించిన తీరును వివరించండి. దైవసాన్నిధ్యాన్నిపాటించడంవల్ల మన ఆధ్యాత్మిక జీవితం ఏలా పెంపజెందుతుందో
తెలియజేయండి.