పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది22ప్రొద్దు పొడువగనే యవి మరలిపోయి
తమ గుహలలో పండుకొనును

23అప్పడు నరుడు పనికి బయలుదేరును
అతడు సాయంకాలము వరకు పాటుపడును

24ప్రభూ!నీ కార్యము లెన్నివిధములుగా నున్నవి!
నీ చెయిదములన్నిటిని విజ్ఞానముతో చేసితివి
ఈ భూమి నీ ప్రాణులతో నిండియున్నది

25అదిగో విశాలమైన మహా సముద్రము
ఆ సాగరములో చిన్నవియు పెద్దవియునైన ప్రాణులు
లెక్కకు మించి జీవించుచుండును

26దానిలో ఓడలు సంచరించుచుండును
నీ వాడుకొనుటకు చేసిన మకరమును దానిలో నున్నది

27ఈ ప్రాణులన్నియు నీమిూద ఆధారపడి జీవించును
అవి తమ కవసరమైనపుడు నీనుండి యాహారమును బడయును

28నీవు వానికి తిండి పెట్టగా అవి తినును
వాని కాహారమీయగా అవి సంతృప్తిగా భుజించును

29నీవు మొగము ప్రక్కకు త్రిప్పకొనినచో అవి తల్లడిల్లను
వాని యూపిరి తీసినచో అవి చచ్చును
తాము పట్టిన మట్టిలోనే కలసిపోవును

30కాని నీవు ఊపిరి పోసినచో ప్రాణిసృష్టి జరుగును
నీవు భూమికి నూత్నజీవము నొసగుదువు

31ప్రభువు కీర్తి ఏనాటికిని మాసిపోకుండునుగాక
అతడు తన సృష్టిని గాంచి యానందించును గాక

32ప్రభువు భూమివైపు పారజూడగా అది కంపించును
కొండలను తాకగా అవి పొగలు వెళ్ళగ్రక్కును

33నా జీవితకాలమెల్ల ప్రభువుపై కీర్తనలు పాడెదను
నేను బ్రతికి యున్నంతకాలము అతని స్తుతులు పాడెదను