పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10నీవు లోయలలో ఊటలను పుట్టించితివి
వాని నీళ్ళ కొండల నడుమ పారును
11వన్యమృగములెల్ల ఆ బుగ్గల నీళ్ళు త్రాగును
అడవి గాడిదలు ఆ నీటితో దప్పిక తీర్చుకొనును
12ఆ చేరువలో పక్షులు గూళ్ళ కట్టుకొని
చెట్ల కొమ్మలలోనుండి కూయును
13నీ ప్రాసాదమునుండి నీవు కొండలమీద వాన కురిపింతువు
నీ యాకాశమునుండి పడిన వానతో నేల సంతృప్తి చెందును
14నీవు పశువుల కొరకు గడ్డిని మొలపింతువు
నరుని యుపయోగము కొరకు మొక్కలు మెలపింతువు
అతడు నేలనుండి పంటలు పండించును
15నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్షసారాయమును
అతని కానందము కలిగించుటకు ఓలివు తైలమును
అతనిని బలాఢ్యుని జేయుటకు ఆహారమును దయచేయుదువు
16నీవు నాటిన లెబానోను దేవదారు వృక్షములు
పుష్కలమైన వర్షముతో సంతృప్తి చెందును
17వానిలో పక్షులు గూళ్ళు కట్టుకొనును
సారస పక్షులు దేవదారులలో గూళ్ళు కట్టుకొనును
18ఎత్తయిన కొండలలో అడవిమేకలు వసించును
పర్వత శిఖరములలో కుందేళ్ళ దాగుకొనును
19ఋతువుల నెరిగించుటకు నీవు చంద్రుని జేసితివి
సూర్యునికి తానెప్పడు అస్తమింపవలయునో తెలియును
20నీవు రేయిని కొనిరాగా చిమ్మచీకట్ల క్రమ్మను
అపుడు వ్యనమృగములెల్ల వెలుపల తిరుగాడును
21కొదమ సింగములు ఎరకొరకు గర్జించును
అవి దేవుని నుండి తమ ఆహారమును వెదకుకొనును