పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3.ఈ కీర్తన విశేషంగా మరజీవితం జీవించేవాళ్ళకు వర్తిస్తుంది. మూడు ప్రతాలూ సామూహిక జీవనమూ మరజీవితంలో ముఖ్యమైన అంశాలు. సోదరప్రేమ లేందే ఎవరుకూడ సామూహిక జీవనం గడపలేరు. ఒకరినొకరు అంగీకరించనివాళ్ళు ఏలా కలసిమెలసి జీవిస్తారు? కనుక మరజీవితం గడిపే వాళ్ళల్లో పరస్పరప్రేమ, అవగాహనం పెరగాలని ప్రార్థిద్దాం.

కీర్తన - 104

సృష్టిలోని వింతలు

1.ఆత్మమా! దేవుని స్తుతింపుము
ప్రభూ! నీవు మిక్కిలి ఘనుడవు
నీవు ప్రాభవ వైభవములను బట్టలవలె ధరించితివి
2.వెలుగును పట్టమువలె తాల్చితివి
ఆకాశమును గుడారమువలె వ్యాపింపజేసితివి
3మిూది జలముల విూద నీ ప్రాసాదమును నిర్మించుకొంటివి
మేఘములు నీకు రథములు
నీవు వాయుపక్షములమిూద స్వారి చేయుదువు
4.గాలులు నీకు దూతలు
తళతళలాడు మెరపులు నీకు బంటులు
5.నీవు నేలను దాని పునాదులమిూద నెలకొల్పితివి
అది యేనాటికిని కదలదు
6.ఆ నేలను సముద్రమను బట్టతో కప్పితివి
సాగర జలము కొండలను మంచివేసెను
7.నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయెను
మేఘగర్ణనము వంటి నీ యాజ్ఞకు వెరచి అవి పరుగిడెను
8.ఆ నీళ్ళ కొండలనుండి "జారి క్రింది లోయలోనికి పారెను
అచటినుండి యవి నీవు నిర్ణయించిన స్థలమును చేరుకొనెను
9.నీవు ఆ నీళ్ళకు దాటరాని హద్దును నెలకొల్పితివి
అవి యా మేరను దాటివచ్చి మరల నేలను మంచివేయవు