పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/320

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిమొదటి ఉపమానంలో ఐక్యతతోకూడిన జీవితాన్ని అభ్యంగంతో పోల్చాడు. ప్రధాన యాజకుణ్ణ అభిషేకించేపుడు అతని తలమీద పరిమళశైలం పోసేవాళ్ళు - నిర్గ 29,7. అది బొట్లబొట్లగా కారి అతని యంగీ మెడపట్టీ మీద పడేది. అలా కారుతుంటే ఆ పరిమళత్తెలం సువాసనలు గుబాళిసూ ఆనందం కలిగించేది. జనులు కలసిమెలసి జీవించడంకూడ ఈ తైలంలాగే ఆనందాన్ని కలిగిస్తుందని భావం.

3. రెండవ ఉపమానంలో ఐక్యతతోకూడిన జీవితాన్ని మంచుకురవడంతో పోల్చాడు. హెర్మోను మంచంటే దట్టమైన మంచు. సియోను కొండమిూద దాని చుట్టుపట్లా మంచు బాగా కురుస్తుంది. అది పంటలను పండిస్తుంది. వేడిమిని తగ్గించి ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఒక్కటిగా ఒనగూడి సోదరప్రేమతో జీవించడంకూడ ఈమంచులాగే ఆనందాన్ని కలిగిస్తుందని భావం.

ప్రభువు సియోనులోని దేవళంలోనుండి తన ప్రజలను దీవించేవాడు. యాజకుని తలమీదినుండి తైలంకారినట్లుగా ఆకాశంనుండి మంచు దిగివచ్చినట్లుగా, ఐకమత్యంతో యెరూషలేములో జీవించే ప్రజలమిూదికి దేవుని దీవెనలు దిగివస్తాయని భావం.

3. ప్రార్ధనా భావాలు

1. ఈ కీర్తనంలో భక్తుడు యెరూషలేమునందలి యూద సమాజంలోని ఐక్యతనుగూర్చి చెప్పాడు. ఆ ఐక్యత చాల రమ్యంగా, సొగసుగా ఉందని కీర్తించాడు. కాని ఈఐక్యత, సోదరప్రేమ వొక్క యూదులకేగాదు మనకుకూడ అవసరం. విశేషంగా ఆధునిక ప్రపంచంలో దేశాలమధ్య జాతులమధ్య వర్గాలమధ్య ఎన్నో ఘర్షణలను చూస్తున్నాం. ప్రజలు ఒకరితో ఒకరు ఐక్యం గావడానికి బదులుగా ఒకరినుండి ఒకరు విడిపోతున్నారు. నరుడు తోడినరునిపట్ల సోదరుల్లాకాదు, తోడేలులా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడచూచినా ప్రేమకాదు ద్వేషం కనిపిస్తుంది. ఈలాంటి పరిస్థితుల్లో మానవజాతికి ప్రేమను ప్రసాదించమని మనం ప్రభువుని తప్పక వేడుకోవాలి.
2. ఎక్కడెక్కడ నా పేరుమిూదిగా ఇద్దరు ముగ్గురు సమావేశమౌతారో వాళ్ళమధ్యలో నేనూ నెలకొని ఉంటానని ప్రభువు వచించాడు-మత్త 18,20. కనుక మనం ప్రభువు పేరుమిూదిగా కలసిమెలసి జీవించాలి. మన జీవితం ఆ ప్రభువు ప్రేమకు సాక్ష్యంగా ఉండాలి. కావున మనం కలహాలతోగాక పరస్పర స్నేహంతో జీవించాలి.