పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/319

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అనే యెషయా ప్రవచనంలోని ప్రభువు పలుకులు ఆమెకు స్పూర్తినిచ్చాయి. ఆమె దేవుడు తన్నుచిన్నబిడ్డనులాఆదరిస్తాడని నమ్మింది–66,12-13. ఆ భక్తురాలిలాగాను ఈ కీర్తనకారునిలాగాను మనంకూడ చిన్నిమార్గంలో, వినయమార్గంలో, పయనించే భాగ్యంకొరకు ప్రభువుని మనవి చేసికొందాం.

కీర్తన - 133

సోదరప్రేమ

1.సోదరు లెల్లరును గూడి ఐకమత్యముతో జీవించుట
చాల మంచిది, చాల రమ్యమైనది
2.అట్టి జీవితము అహరోను తలమిదినుండియు
గడ్డమునుండియు కారి
అతని యంగీ మెడపట్టీమిూద పడు
విలువగల యభ్యంజన తైలము వంటిది
3.అట్టి జీవితము సియోను కోండమిూద కురియు
హెర్మోను మంచువంటిది
ఆ సియోనున ప్రభువు తన దీవెన లొసగును
శాశ్వత జీవమును దయచేయును.

1. పరిచయం

ఈ కీర్తన ఐక్యతాభావాన్ని వర్ణిస్తుంది. తోడిజనంతో కలసిమెలసి జీవిస్తే ఎంతో ఆనందం కలుగుతుందని చెప్తుంది. జ్ఞానగ్రంథాలు బోధించే అంశాల్లో ఐక్యత వొకటి. ఇక్కడ కీర్తనకారుడు ఈ యంశాన్నెత్తుకొని చక్కని పాట వ్రాసాడు. నాడు యూదులకుమల్లె నేడు మనకుకూడ ఐక్యత, ෆියරඹීක అత్యవసరం.

2. వివరణం

1. పాస్మోత్సవం మొదలైన సందర్భాల్లో యూదులు దేశదేశాలనుండి యెరూషలేముకువచ్చి తన బంధువర్గంతో ఐక్యమయ్యేవాళ్లు, అలా ఒకరితోవొకరు ఐక్యమై ఆప్యాయంగా కాలంగడుపుతూంటే చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉండేది.

2. తోడిజనంతో కలసి జీవిసూంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈయానందాన్ని వివరించడానికి కీర్తనకారుడు రెండుపమానాలు ఎత్తుకొన్నాడు. రెండూ సంతోషాన్ని సూచించేవే. అవి 1) అభ్యంగం, 2) మంచు కురియడం.