పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/318

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కలిగించింది అతని యెదలోని కోరికలుకాదు, భగవంతునిమిూద నమ్మకం. ఇది చాల గొప్ప భక్తిభావం.

3. రచయిత తాననుభవించే మనశ్శాంతిని ఆధారంగా తీసికొని తోడి యిస్రాయేలీయులకు హెచ్చరిక చేస్తున్నాడు. మిూరుకూడ నాలాగే ప్రభుని నమ్మి మనశ్శాంతిని పొందండని హెచ్చరిస్తున్నాడు.

3. ప్రార్ధనా భావాలు

1. యూదుల్లో "హనవిం” లేక దీనులు అనే వర్గంవాళ్ళు ఉండేవాళ్ళు వినయంతో దేవునిమిూద ఆధారపడి జీవించడం వీళ్ళ ప్రధానలక్షణం. ఈ కీర్తనకారుడుకూడ ఈ దీనులవర్గానికి చెందినవాడే. కనుకనే అతడు నేను చిన్నబిడ్డలాగ దేవుడనే తల్లి రొమ్మువిూద పండుకొని నిద్రపోతానని చెప్పకొన్నాడు. యెషయా ప్రవక్త ఆనాటి ఆహాసురాజునూ ప్రజలనూ మందలిసూ “దేవుణ్ణి నమ్ముకొని నెమ్మదిగా ఉండడంలోనేమి శక్తియిమిడి ఉంది" అనిచెప్పాడు – 30,15. మన కీర్తనకారుడు చెప్పిందికూడ యిదే. కనుక మనం కూడ పొగరు తగ్గించుకొని దేవునిపై ఆధారపడి జీవించేభాగ్యం కొరకు ప్రార్థిద్దాం.
2. మిరు చిన్నబిడ్డల్లా తయారైతేనేగాని పరలోకరాజ్యంలో ప్రవేశింపరని క్రీస్తు తన శిష్యులకు చెప్పాడు - మత్త 18,3. ఇక్కడ చిన్నబిడ్డల్లా తయారుకావడమంటే దేవుణ్ణి నమ్మి అతనిమిద ఆధారపడిజీవించడమే. క్రీస్తు తండ్రిమిూద ఆధారపడి జీవించాడు. అలాగే మనమూ క్రీస్తమిూదా పరలోకపు తండ్రిమిూదా ఆధారపడి జీవించాలి. ఈ కీర్తనకారుని సందేశంకూడ యిదే. నరుడు అహంకారంకొద్దీ నాకు నేను చాలుదుననుకొంటాడు. దేవుణ్ణి పట్టించుకోడు. ఈ యహంభావం వద్దనే ఈ కీర్తన చెప్పేది. ఈ భాగ్యం కొరకు కూడ ప్రార్థిద్దాం.
3. చిన్న తెరేసమ్మ చిన్నిమార్గమూ ఈ కీర్తన బోధా ఒకటే. మనం దేవుణ్ణి నమ్మి చిన్నబిడ్డల్లా జీవించాలనే ఆమె కూడ బోధించింది. "యెరూషలేమనే తల్లి మియాకు చంటిబిడ్డలకు వలె పాలిస్తుంది మిమ్మ తన చేతులలోని కెత్తుకొంటుంది తన వొడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తుంది తల్లి కుమారునివలె నేను మిమ్ము నోదారుస్తాను యెరూషలేమున మిమ్మనోదారుస్తాను"