పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/317

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2 నా హృదయము నిమ్మళముగను ప్రశాంతముగను నున్నది
 పాలు మాన్పించిన శిశువు
 తల్లి రొమ్ముమిూద ప్రశాంతముగా పరుండియున్నట్లే
 నా హృదయము నాలో నిమ్మళముగా నున్నది
3 యిప్రాయేలీయులారా!
మీరు ఇప్పడును ఎప్పడును ప్రభువును నమ్మడు.

1. పరిచయం

ఈ కీర్తనను చెప్పిన భక్తుడు దేవుణ్ణి నమ్మి చిత్తశాంతిని పొందాడు. తాను మహత్తర కార్యాలను సాధించి ప్రసిద్ధిలోకి రావాలనే కోర్మెలను పరిత్యజించాడు. తన గర్వాన్ని అణచుకొన్నాడు. చిన్ననాడతనికి చాల గొప్ప కోర్మెలు ఉండేవి. అతడు పేరు తెచ్చుకోవడానికి చాల ప్రయత్నాలు కూడ చేసాడు. కాని ఆ యత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పు వృద్దుడయ్యాక తన కోరికలన్నీ విడనాడి దేవుణ్ణి నమ్మి జీవిస్తున్నాడు. చిత్తశాంతిని అనుభవిస్తున్నాడు. ఈ కీర్తన గర్వాన్ని అణచుకొని వినయాన్ని అలవర్చుకోవాలని చెప్తుంది. దేవుణ్ణి నమ్మి అతనిమీద భారంవేసి జీవిస్తే హృదయశాంతి లభిస్తుందని చెప్తుంది.

2. వివరణం

1. నా హృదయం గర్వంతో పొంగిపోవడం లేదు, నా కన్నులకు పొరలుకమ్మలేదు అంటే, నేను అహంకారాన్ని వదలుకొన్నానని భావం. కీర్తనకారునికి పూర్వం మహత్తరకార్యాలు సాధించి పేరుతెచ్చుకోవాలనే కోరికలుండేవి. ఆ కోరికలను తీర్చడానికి చాల ప్రయత్నాలు కూడ చేసాడు. తనకు అర్థంగాని సంగతులతో సతమతమయ్యాడు. అతని హృదయం గర్వంతో నిండివుండేది. కాని యిప్పడు ఆ కోరికలూ ఆశలూ వదలుకొన్నాడు. తన గర్వాన్ని అణచుకొన్నాడు. ఫలితంగా ఇప్పడతని హృదయంలో పూర్వంలేని చిత్తశాంతి చోటుచేసికొంది.

2. భక్తుడు తన హృదయం నిమ్మళంగా ఉందని చెప్పకొంటున్నాడు. మొదట అతని హృదయం అతనికి లొంగేది కాదు. తానేవో ఘనకార్యాలు సాధించాలనుకొనేవాడు. హృదయంలో ఏవో ఆశలు అలల్లా చెలరేగుతుండేవి. కాని అతడు ప్రయత్నంచేసి తన ఆశలను అణచుకొన్నాడు. ఇప్పడు అతని యెదలొ "శాంతి నెలకొంది.

పాలు మానని శిశువు పాలకొరకు అల్లరిచేస్తుంది. కాని పాలు మానిన శిశువు ప్రశాంతంగా తల్లి రొమ్ముమీద పండుకొని నిద్రిస్తుంది. అలాగే కీర్తనకారుడుకూడ ఓ పసిబిడ్డలాగ భగవంతుడనే తల్లి రొమ్ముమీద పండుకొన్నాడు. అతినికి నెమ్మదిని