పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. వివరణం

1. ప్రభువు కీర్తనకారుణ్ణి పెద్ద జబ్బునుండి కాపాడాడు. అతడు చనిపోయినట్లయితే అతని శత్రువులు సంతోషించేవాళ్ళే. కాని ప్రభువు అనుగ్రహం వలన మరణం నుండి తప్పించుకొన్నాడు.
 2. అతడు వ్యాధిలో దేవునికి మొరపెట్టగా ప్రభువు అతని జబ్బును నయంచేసాడు.
 3.. పాతాళలోకం, మృతలోకం, అంటే చచ్చినవాళ్ళ చేరుక్రానే స్థలం. యూదులు దీన్ని "షెయోల్" అన్నారు. ఇది సముద్రం క్రింద భూగర్భంలో ఉంటుందనీ, అంధకారమయంగా నిరాశాపూరితంగా ఉంటుందనీ భావించారు. అక్కడికి వెళ్ళినవాళ్లు ప్రేతాల్లాగ ఉండిపోతారనీ, నిద్రావస్థలో ఉంటారనీ, దేవుణ్ణిస్మరించుకోలేరనీ, దేవుడు కూడ వాళ్ళను పట్టించుకోడనీ అనుకొన్నారు. పూర్వవేద యూదులకు ఈ పాతాళ లోకమంటే మాలావు భయం. తాము అక్కడికి పోకూడదనీ, దీర్ఘకాలం ఈభూమిమిూదనే బ్రతికిఉండాలనీ వాళ్ళ కోరిక. ఈ భూమి జీవవంతుల లోకం, షెయోల్ మృతలోకం. మన కీర్తనకారుడు చనిపోయినట్లయితే ఈ మృతలోకానికి వెళ్ళేవాడే దేవుని అనుగ్రహంవల్ల బ్రతికి ఈ భూమిమిూద సంచరిస్తున్నాడు.
 4. కీర్తనకారుడు తన్ను మరణంనుండీ మృతలోకం నుండీ కాపాడినందులకు దేవుణ్ణి స్తుతించమని దేవళంలోని భక్తబృందాన్ని అర్ధిస్తున్నాడు. దేవాలయారాధనలో భక్తులు తమ కష్టసుఖాలను తోడి భక్తులముందు వెల్లడిచేసికొనేవాళ్ళ ఆ తోడిభక్తులు కష్టంలోవున్న వారికొరకు ప్రార్ధన చేసేవాళ్ళు దేవునినుండి యేదైన ఉపకారం పొందినవారి తరపున కృతజ్ఞతా స్తుతి అర్పించేవాళ్లు.
 5. దేవుని కోపమంటే అతని శిక్ష దేవుడు నరుబ్లాగ దీర్ఘకాలం కోపించడు. అసలు అతడు మనమిూద కోపపడేది మనకు కీడు చేయటానికిగాదు. మేలుచేయడానికే. దేవుని శిక్ష వలన మనకు మంచి బుద్ధి అలవడుతుంది. జీవితంలో మనకు దుఃఖాలు కలుగవచ్చు. కాని అవి దాటిపోయాక అతడు మనకు ఆనందాన్ని దయచేస్తాడు.
 6. రచయిత తన ఆత్మకథను చెప్పకొంటున్నాడు. తానేలా అహంకారాన్ని విడనాడి వినయాన్ని అలవర్చుకొన్నాడో వివరిస్తున్నాడు. భక్తుడికి అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయి. కనుక అతనికి తల తిరిగింది. అతడు తన సామర్థ్యం వలననే విజయాలు సాధించాననుకొన్నాడు. ఇక తనకు ఏ లోటూ లేదు, ఏ కీడూ కలగదు అనుకొన్నాడు. అహంభావంతో దేవుణ్ణి అనాదరం చేసాడు. ఇది పెద్దతప్ప.
 7. కొన్నాళ్ళపాటు ప్రభువు అతన్నిపర్వతదుర్గంలా కాపాడాడు. ఐనా కీర్తనకారుడు దాన్ని స్వీయశక్తినిగా భావించాడేగాని భగవంతుని కరుణనుగా అర్థంజేసికోలేదు. అతనికి • పొగరు పెరిగింది. కనుక దేవుడతనికి పాఠం నేర్పగోరి అతనినుండి తన ముఖాన్ని