పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/305

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


9 “నేను పాతాళమును చేరుకొనిన యెడల
 నీకేమి లాభము కలుగును?
 మృతులు నిన్ను స్తుతింతురా?
 మేరలేని నీ మంచితనమును కీర్తింతురా?
10 ప్రభూ! నీవు నా మొర నాలించి నా మిూద దయజూపుము
 దేవా నన్నాదుకొనుము" అని వేడుకొంటిని
11 నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి
 సంతాపసూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించి
నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి
12 కనుక నేను మౌనముగా నుండక నీ సుతులను పాడెదను
 నా ప్రభువవైన దేవా! నేను నీకు సదా వందనము లర్పింతును.

1

. పరిచయం

ఇది కృతజ్ఞతా కీర్తనల వర్గానికి చెందింది. ఈకీర్తన వ్రాసిన భక్తునికి మొదట అన్నికార్యాలు సవ్యంగానే జరిగిపోతుండేవి. కనుక అతనికి విపరీతమైన ఆత్మవిశ్వాసం కలిగింది. అహంభావం పెరిగింది. అతడు తన శక్తివల్లనే తాను విజయాలు సాధించాననుకొని దేవుణ్ణి విస్మరించాడు. దేవుడు ఆ భక్తునికి పాఠం నేర్పగోరి అతన్ని పెద్దవ్యాధికి గురిచేసాడు. కీర్తనకారుడు తాను చనిపోతానేమోనని భయపడ్డాడు. తన అవివేకాన్ని మన్నించి తన్ను బ్రతికించమని ప్రభువుకి మనవి చేసాడు. దేవుడు కరుణతో అతని రోగాన్ని తొలగించాడు. భక్తుడు దేవళంలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులుచెల్లించాడు. కనుక అహంభావాన్ని విడనాడి వినయాన్ని అలవర్చుకోవడం ఈ కీర్తనలోని ఇతివృత్తం. జీవితంలో మనంకూడ చాలసారులు అచ్చంగా ఈరచయితలాగే ప్రవర్తించివుంటాం. కనుక అతని గేయం నేడు మనకు కూడ ఆదర్శంగా వుంటుంది.

2. విభజనం

1-3 దేవుడు కీర్తనకారుని వ్యాధిని తొలగించడం
4-5 కృతజ్ఞతాస్తుతి
6-10 రచయిత పొగరూ, వ్యాధీ, ప్రార్ధనా
11-12 దేవుడు అతని వ్యాధినితొలగించడం, వందనసమర్పణం