పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


5 సముద్ర మతినిది, అతడే దానిని చేసెను
 ధరణి యతనిది, అతడే దానిని కలిగించెను
6 రండు, శిరమవంచి యతని నారాధింతము
 మనలను సృజించిన ప్రభువు ముందు మోకరిల్లుదము
7ఎ అతడు మన దేవుడు
 మనము అతడు కాచికాపాడు ప్రజలము
 అతడు మేపు మందలము
7బి నేడు మిూరతని మాట నినిన నెంత బాగుండును!
8 "మెరీబా చెంత మిగా పితరులవలె,
 నాడు ఎడారిలో మస్సా చెంత మిగా పితరులవలె,
 మిూరును హృదయమును కఠినము చేసికోవలదు
9 నేను చేసిన కార్యములను చూచిన పిదపగూడ
మిూ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి
10 నలబదియేండ్లపాటు ఆ ప్రజలు నన్ను విసిగింపగా
 ఈ జనులకు నాపట్ల నమ్మకములేదు
వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పల్మితిని
11 కనుక నేను వారిమిూద ఆగ్రహము చెంది
 మిూరు నేను నిర్ణయించిన విశ్రామ స్థానమును చేరజాలరని
 ప్రతిజ్ఞ చేసితిని".

1. పరిచయం

ఇది ప్రవచనాత్మక కీర్తనల వర్గానికి చెందింది. ఈ వర్గం కీర్తనల్లోని భావాలు ప్రవక్త ప్రవచనంద్వారా భక్తులను హెచ్చరించినట్లుగా ఉంటాయి. ప్రస్తుతగీతంలో ప్రవక్తయైన కీర్తనకారుడు, యెరూషలేం దేవాలయంలో ఆరాధనకు గుమిగూడిన భక్తులకు సందేశం చెప్తున్నాడు. సృష్టికర్తా, నిబంధనకారుడూ ఐన దేవునికి విధేయులు కండని వాళ్ళను హెచ్చరిస్తున్నాడు. పూర్వం ఐగుప్తనుండి వెడలివచ్చి యెడారిలో ప్రయాణం చేసిన పితరులు దేవుని యాజ్ఞ విూరినందున వాగ్దత్త భూమిని చేరుకోలేకపోయారు. ఆ యెడారిలోనే కన్నుమూసారు. అది వాళ్ళనుభవించిన శిక్ష. కనుక విూరు దేవునికిలొంగి అతని యాజ్ఞలు