పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భక్తుడు చెప్పిన 11వ చరణాన్ని స్మరించుకొన్నపుడు మన కష్టాల్లోను బాధల్లోను తప్పకుండా నమ్మకమూ ఆశాభావమూ చిగురిస్తాయి.

2.నూత్నవేద రచయితలు ఈ కీర్తనకారుని శ్రమలను క్రీస్తుకి అన్వయింపజేసారు. "నా దేవా నా దేవా నన్నేల చేయి విడచితివి" అనే వాక్యాన్ని(1) క్రీస్తు సిలుమీద వ్రేలాడుతూ జపించాడు - మత్త27,40. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము" అనే వాక్యాన్ని (8) సిలువమిూద ప్రేలాడే క్రీస్తుని దూషిస్తూ ప్రధానాచార్యులు పలికారు - మత్త 27,40. "వాళ్లు నా బట్టలను తమలోతాము పంచుకొన్నారు, నా దుస్తులకొరకు చీట్ల వేసికొన్నారు" అనే వాక్యాన్ని (18) యోహాను సువిశేషం మృతక్రీస్తు బట్టలను పంచుకొనిన సైనికులకు అన్వయింపజేస్తుంది - 19,24. ఈ విధంగా ఈ గీతం క్రీస్తు శ్రమలను తలపునకు తెస్తుంది. కనుకనే యిది మెస్సియా కీర్తనల్లో ఒకటైంది. అన్నికీర్తనలూ క్రీస్తునందే సార్ధక్యం పొందుతాయి. వాటి పరమార్థం క్రీస్తే, కాని మెస్సియా కీర్తనలు ప్రభువు జీవితానికి యింకా యొక్కువగా అన్వయిస్తాయి. కనుక ఈ గీతంద్వారా మనం క్రీస్తు శ్రమలను ధ్యానించుకోవచ్చు పద్నాలుగు స్థలాల ప్రార్థన చేసికొనేప్పడూ, తపస్సు కాలంలోను ఈ గేయాన్ని భక్తితో జపించవచ్చు.

ఇక, క్రీస్తు శ్రమలను జ్ఞప్తికి తెచ్చే ఈ కీర్తనలోని శ్రమలు, నేడు మనమిూద కూడ సోకుతాయి. ప్రభువు సిలువ చాలసారుల మనమీద భారంగా వాలుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ గీతాన్ని భక్తితో జపిస్తే ఎంతో వూరట కలుగుతుంది.

కీర్తన - 95

దైనందిన ప్రార్దన

1. రండు, ప్రభువును సంతసముతో స్తుతింతము
 మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము
2. కృతజ్ఞతా స్తుతులతో అతని సన్నిధిలోనికి వత్తము
సంతోషముతో కీర్తనలు పాడుచు అతనిని వినుతింతము
3.ప్రభువు మహదేవుడు
దైవములందరికిని మహారాజు
4.భూగర్భము మొదలుకొని పర్వత శిఖరముల వరకును
అన్నిటిని అతడే పాలించును