పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


21 సింగము నోటినుండి నన్ను తప్పింపుము
     అడవియెద్దు కొమ్మలనుండి నన్ను కావము
22 నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును
      భక్తసమాజమున నిన్ను కీర్తింతును
23 ప్రభువు భక్తులారా! మీ రతనిని స్తుతింపుడు
       యాకోబు వంశజులారా! మీ రతనిని మహిమపరపడు
       యిస్రాయేలు ప్రజలారా! మీ రతనిని భజింపడు
24 అతడు దీనులను చిన్నచూపు చూడడు
       వారి శ్రమల ననాదరము చేయడు
       వారి నుండి తన మొగమును దాచుకొనడు
       వారు తనకు మొరపెట్టినపుడు వారి వేడికోలు నాలించును
25 మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును
       నీ భక్తబృందము నెదుట నా మొక్కుబడులు చెల్లింతును
26 పేదలు తనివిదీర భుజింతురు
       ప్రభువు నభిలషించువారు అతనిని స్తుతింతురు
       ఆ జను లెల్లవేళల శుభములు బడయుదురుగాక
27 లోకములోని జాతులెల్ల ప్రభువును జ్ఞప్తికి దెచ్చుకొని
       అతని యొద్దకు మరలివచ్చును
       సకల జాతులును అతనిని పూజించును
28 ప్రభువు రాజ్యము చేయును
       జాతులనెల్ల పరిపాలించును
29 గర్వాత్ములెల్లరు అతనికి దండము పెట్టుదురు
       మృత్యువు వాతబడు నరమాత్రులెల్లరు అతనికి తలయొగ్గుదురు
30 భావితరములవారు అతనిని సేవింతురు
       ప్రజలు రాబోవు తరములవారికి ప్రభుని గూర్చి చెప్పదురు
31 ఇక పుట్టబోవు జనులకును
       ప్రభువు తన ప్రజకు దయచేసిన రక్షణమునుగూర్చి వివరింతురు.