పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


7. యుద్ధరంగంలో నీ చుటూ వందలూ వేలూ సైనికులు కూలవచ్చు. నీకు మాత్రం ఏ ప్రమాదమూ కలుగదు. ఈ చరణం చెప్పిన కీర్తనకారునికి దేవునిపట్ల కొండంత విశ్వాసం వుండి వుండాలి.

8. నీతిమంతులు యుద్ధంలో దుషులు చావడాన్ని చూస్తారు. కాని ఆ నీతిమంతులకు ఏ యపాయమూ కలగదు.

9. ఈ చరణంలో ఆశ్రయం, సదనం అంటే యిల్ల, అనగా భక్తునికి దేవుడు ఇల్లులాంటివాడౌతాడు. అతడు ప్రభువులో వసిస్తాడు. ఆ ప్రభువు అతన్ని కాపాడతాడు.
10. ప్రభువు తన దాసుడ్డీ అతని కుటుంబాన్నీ కూడ కాచి కాపాడతాడు. అతడు కాని అతని బంధువులు కాని అంటురోగాల వాతబడరు.

11-12 ఈ చరణాల్లో ప్రభువు పంపే దేవదూతలు భక్తులను కాపాడతారని చెప్తున్నాడు. పాలస్తీనా దేశంలోని రహదారులు రాళ్ళతో నిండివుంటాయి. కనుక దేవదూతలు భక్తుడు తన ప్రయాణంలో రాళ్ళకు తట్టుకొని పడిపోకుండా కాపాడతారు. ఇక్కడ రాతికి తట్టుకొని పడిపోవడమంటే ప్రమాదానికి గురికావడమని అర్థం. కనుక సన్మనస్కులు భక్తులను అపాయాలనుండి రక్షిస్తారని భావం. ఇంకా, యూదుల భావాల ప్రకారం ప్రయాణమంటే జీవిత యాత్రకూడ. కనుక ఈ జీవితయాత్రలో దేవదూతలు భక్తుని సకలాపదలనుండీ కాపాడతారని ఫలితార్థం.

దేవదూతలు భక్తుణ్ణి తమ చేతుల్లో ఎత్తిపట్టుకొంటారు. అనగా తల్లి తన బిడ్డను సురక్షితంగా చేతుల్లో మోసికొనిపోయినట్లుగా మోసికొని పోతారని భావం.

 13. ఈ చరణంలో సింహం, కొదమ సింగం ఒకటే ప్రాణి. హీబ్రూ కవిత్వంలో ఒకే భావాన్ని రెండుసార్లు చెప్పడం పరిపాటి. ఈ సింహం అపాయానికి చిహ్నం. అనగా అపాయాల్లో దేవుడు భక్తుణ్ణి రక్షిస్తాడు. అలాగే నాగుబాము, కాలసర్పం ఒకటే ప్రాణి. ఈ సర్పం ప్రమాదానికి చిహ్నం. అనగా ప్రమాదాల్లో దేవుడు తన దాసుడ్డి కాపాడతాడని భావం. కాలసర్పాన్ని చంపి దాని తలమీద కాలు మోపినట్లుగా ఉన్న దేవునిబొమ్మగల తాయెతులను ఐగుప్రీయులు ధరించేవాళ్ళ మొత్తంమీద, ఫరోరప్రమాదాల్లో కూడ దేవుడు తన సేవకుణ్ణి ఆదుకొంటాడని ఈ చరణం భావం.

14-16. దేవుని తరపున దేవళంలోని యాజకుడో లేక ప్రవక్లో భక్తులకు దైవోక్తిని చెప్తున్నాడు. దైవోక్తి అంటే దేవుడు ప్రజలతో చెప్పే ప్రవచనం.

 దేవుణ్ణి ప్రేమించేవాళ్ళనీ, అతన్ని ప్రభువునిగా అంగీకరించి పూజించేవాళ్ళనీ, ఆ దేవుడు కాపాడతాడు.
 
దేవుడు తన భక్తుల మొర వింటాడు. ఆపదల్లో, విపత్తుల్లో వాళ్ళని కాపాడతాడు. భక్తుల దేవుని రక్షణను పొంది కీర్తని గడిస్తారు.