పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7-8 యుద్ధంనుండి
9-13 విశ్వాసం గలవాళ్ళు ఆపదలనుండి తప్పించుకొంటారు.
14-16 దేవుణ్ణి నమ్మినవాళ్ళను ఆ దేవుడే కాపాడతాడనే దైవోక్తి

3. వివరణం


1-2 యిప్రాయేలు యాత్రికులు రాత్రి దేవళంలో వసించేవాళ్లు, వేకువనే లేచి ప్రభువును ఆరాధించుకొనేవాళ్లు దేవుడే భక్తులను రక్షిస్తాడు. ప్రభువు తన భక్తులను కాపాడతాడనేది ఈ కీర్తనలోని ముఖ్యాంశం. ఈ యంశాన్ని ఈ మొదటి చరణంలోనే చెప్పాడు.

భక్తుడు దేవాలయంలో దేవుని రెక్కల నీడలో వసిస్తాడు. దేవళంలోని మందసం మీద దేవదూతల బొమ్మలకు రెక్కలుండేవి. యిప్రాయేలు ప్రజలు ఆ రెక్కలను జూచి తమ దేవుడు తల్లిపక్షిలాంటివాడని యెంచారు. దేవాలయంలో ఈలాంటి దేవుని మరుగున వసించేవాళ్లు అతనితో ప్రభూ! నీవు నాకాశ్రయానివని చెప్పకొంటారు. అనగా అతన్ని పూర్తిగా నమ్ముతారని భావం,

3. వేటకాడు ఉరులు పన్ని మృగాలను పట్టుకొంటాడు. ఆలాగే శత్రువులు భక్తునిమీద ದಾಡಿ చేయవచ్చు. ఆలాగే ఫటోరవ్యాధులుకూడ వచ్చిపడి అతని ప్రాణాలు తీయవచ్చు. ఈ మరణ భయాలనుండి ప్రభువు తన దాసుడ్డి రక్షిస్తాడు.

4 మందసంమీది దేవదూతల బొమ్మలకు రెక్కలుండేవి అని చెప్పాం. ఆ రెక్కలను చూచి యిస్రాయేలు ప్రజలు తమ దేవుడు ఓ తల్లి పక్షిలాంటివాడనీ, తాము ఆ పక్షి పిల్లలమని ఊహించుకొన్నారని చెప్పాం. దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగినతనం నరుడ్డి ఓ డాలులాగ, రక్షణాయుధం లాగ కాపాడుతుంది. డాలు ఆత్మరక్షణకోసం యుద్ధంలో ూడుకొనే పళ్ళెంలాంటి ఆయుధం.

5. రాత్రిలో పిశాచాలు తిరుగుతూ నరులకు హాని చేస్తాయి. ఇవే "రేయి కలిగే అపాయాలు" పిశాచం మధ్యాహ్నపు ఎండ వేడిమిద్వారా నరులకు హాని చేయవచ్చు. ఇవే "పగటిపూట" తగిలే బాణాలు,

6. చీకటిలో సోకే అంటురోగాలు అంటే పిశాచం రాత్రిలో తిరుగుతూ కలిగించే వ్యాధులు, ఐగుప్రీయులు రాత్రిలో చచ్చారు - నిర్ణ 114 అస్సిరియను సైన్యంకూడ రాత్రిలోనే చచ్చింది - యెష 37, 86. మట్ట మధ్యాహ్నపు మారి అంటే మధ్యాహ్నం తిరిగే పిశాచం. 5-6 చరణాలు పిశాచం తెచ్చిపెట్టే వ్యాధిబాధలనూ చేతబళూ మొదలైన వాటినీ పేర్కొంటాయి. పూర్వులు అన్ని రోగాలకూ పిశాచాలే కర్తలని నమ్మారు. దుష్టులైన నరులుకూడ ఈ 5-6 చరణాల్లో పేర్కొన్న కార్యాలను చేయవచ్చు.