పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11 ప్రభువు నిన్ను తన దూతల యధీనమున నుంచును
నీ వెచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు

12 నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు

13 నీవు సింహమును నాగుబామును కాలితో మట్టెదవు
 కొదమ సింగమును కాలసర్పమును పాదములతో త్రోక్కెదవు

14 “నన్ను ప్రేమించువారిని నేను రక్షించెదను
నా ప్రాభవము నంగీకరించువారిని నేను కాపాడెదను

15 వారు నాకు మొరపెట్టినపుడు నేను వారికి ప్రత్యుత్తర మిత్తును
వారి యాపదలలో వారి నాదుకొందును
వారిని విపత్తులనుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును

16 వారిని దీర్గాయువుతో సంతృప్తి పరచెదను
వారికి నా రక్షణము ననుగ్రహించెదను"
అని ప్రభువు పల్కుచున్నాడు.

1. పరిచయం

ఇది జ్ఞాన కీర్తనల వర్గానికి చెందింది. దేవుడు నీతిమంతులను అన్ని యాపదలనుండి కాపాడతాడు. కనుక సజ్జనుడు భగవంతుణ్ణి నమ్మి జీవించాలి. 'ఈ కీర్తనలో చాల పదచిత్రాలు తగులుతాయి. ఈ గీతం ఉరులు, అంటురోగం, చీకట్లు, రాళ్లు, పాములు, సింహాలు మొదలైన సకలాపదల నుండీ ప్రభువు భక్తులను కాపాడతాడని చెప్తుంది. మనం అపాయాల్లో కష్టాల్లో బాధల్లో చీకట్లలో ఉన్నప్పడు ఈ గీతాన్ని వాడుకోవచ్చు. ఏవేవో భయాలతో బాధపడేవాళ్ళకు ఇది బలం మందులా ఉపయోగపడుతుంది. గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ గీతం మన నమ్మకాన్నిపెంచుతుంది.

2. విభజనం

1-13దేవుణ్ణి నమ్మినవాళ్ళను దేవుడే కాపాడతాడు.
1-3 మరణం నుండి
4-6 అంటురోగాల నుండి