పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీర్త - 91

దేవుని రక్షణం

1.మహోన్నతుని మరుగున వసించువాడు
సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు

2.ప్రభువుతో నీవు నా కాశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు
నేను నమ్మిన దేవుడవు అని చెప్పకొనును

3.వేటకాని యురుల నుండియు
ఘనోరవ్యాధుల నుండియు అతడు నిన్ను కాపాడును

4.అతడు తన రెక్కలతో నిన్ను కప్పను
అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు
అతని విశ్వసనీయత నీకు డాలుగాను
రక్షణాయుధముగాను ఉండును

5.నీవు రేయి కలుగు అపాయములకును
పగటిపూట తగులు బాణములకును నెరవనక్కరలేదు

6.చీకటిలో సోకు అంటురోగములకును
మట్టమధ్యాహ్నము హానిచేయువారికిని నీవు భయపడనక్కరలేదు

7.నీ దాపన వేయిమంది కూలినను
నీ కుడి ప్రక్కన పదివేలమంది పడినను
నీ కే అపాయము కలుగదు

8.నీ కన్నులతో నీవు
దుషులు శిక్ష అనుభవించుటను జూతువు

9.నీవు ప్రభువును నీ కాశ్రయముగాను
మహోన్నతుని నీకు సదనముగాను జేసికొంటివి

10.నీ కెట్టి కీడును సంభవింపదు
నీ యింటి చెంత కెట్టి యంటురోగమును రాదు