పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13-16 అతనిలో ఘర్షణ పట్టడం
17 అతనికి జ్ఞానోదయం కలగడం
18–22 అతనికి దుఘ్టల దుర్గతి అర్థంకావడం
23-28 తనకున్న దైవభక్తి వలన లాభమేమిటో అర్థంకావడం

3. వివరణం

1. విశుద్ధ హృదయులంటే దేవునిపట్ల భక్తిగలవాళ్ళ దేవుడు విశుద్ధహృదయులకు మేలు చేసాడు అని చెప్పడం ద్వారా, కీర్తనలోని భావాన్నంతటినీ ఈ మొదటి చరణంలో సూచించాడు.
 2-3. దుర్మార్గుల వృద్ధిని చూడగా కీర్తనకారునికి ప్రలోభం పట్టింది. తానూ వాళ్ళలాగే పాపకార్యాలు చేయాలని ఆశించాడు.
4-5 దుఘ్టలకు ఏ బాధలూ లేవు, ఏ శ్రమలూ లేవు.
6. అహంకారమూ హింసా వాళ్ళకు నిత్యకృత్యాలయ్యాయి.
7-9, వాళ్ళ దుష్కార్యాలకు అంతమే లేదు.
10. దేవుని ప్రజలుకూడ వాళ్ళమాట నమ్మారు.
11. దేవుడున్నాడుకాని అతడు మన సంగతిని పట్టించుకోడు. కనుక మనం ఏమైనా చేయవచ్చు - ఇది ఆ దుఘ్టల నమ్మకం.
12. దుఘ్టలు ఈలా రోజురోజుకీ వృద్ధిలోకి వస్తూంటే, ఇక దేవుడుండి మాత్రం ఒరిగిందేమిటి?
13. దుఘ్టలకు సంపద లబ్బుతున్నాయి. నేను నిజాయితీతో జీవించినా నా కేలాభం కలగడంలేదు,
14. ప్రభువు కీర్తనకారునికి ఏదో వ్యాధి కలిగించాడు, దానివలన అతడు ప్రతిరోజూ వేదనలు అనుభవించాడు.
15, 11వ చరణంలో ఆ దుఘ్టలు మాట్లాడినట్లుగానే కీర్తనకారుడూ మాట్లాడి ఉన్నట్లయితే అతడు దేవుని ప్రజలకు ద్రోహం చేసివుండేవాడు. తనతోపాటు దేవళంలో దేవుణ్ణి పూజించే తోడి యిసాయేలు భక్తులే ఈ దేవుని ప్రజలు. ఈ భక్తసమాజం అతని భక్తిని నిలబెట్టింది. కనుక తాను దేవునికి ద్రోహంచేస్తే ఈ భక్త సమాజానికి ద్రోహం చేసినట్లే.
16. అతడు ఎంత ప్రయత్నించినా దుష్టులు ఎందుకు వృద్ధిలోకి వస్తున్నారు అనే సమస్య అతనికి అర్థంకాలేదు.