పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23 ఐనను నేను నిరంతరము నీ కంటిపెట్టుకొని యుంటిని
       నీవు నా కుడిచేతిని పట్టుకొని నన్ను నడిపింతువు
24 నీ యుపదేశముతో నీవు నన్ను నడిపింతువు
       కడన నన్ను నీ మహిమలోనికి గొనిపోయెదవ
25 స్వర్గమున నీవుదప్ప నా కింకెవరున్నారు?
       ఈ భూమిమీద నీవుదప్ప మరియొకటి నాకు రుచింపదు
26 నా దేహమును నా హృదయమును
       ప్రేమ వలన కృశించిపోవుచున్నవి
       దేవుడే సదా నా కాశ్రయము, నాకు వారసభూమి
27 కావున నీ నుండి దూరముగా వైదొలగువారు చతురు
       నిన్ను త్యజించువారిని నీవు నాశము చేయుదువు
28 దేవుని చెంతనుండుటే నాకు క్షేమకరము
       నేను ప్రభువైన దేవుని ఆశ్రయించితిని
       అతడు చేసిన కార్యములెల్ల ప్రకటన చేయుదును.

1. పరిచయం

లోకంలో దుఘ్టలు అపమార్గంలో సుఖాలూ సంపదలూ విజయాలూ గణిస్తుంటారు. కీర్తనకారునికి నేనుమాత్రం అలా యెందుకు చేయకూడదు అని ప్రలోభం కలిగింది. అతడు తనలో తాను ఘర్షణపడ్డాడు. కడకు అతడు దైవప్రబోధంవల్ల దుఘ్టలు నాశమైపోతారని గ్రహించాడు. తన ప్రలోభాన్ని అణచుకొన్నాడు. అతడు యోబులాంటివాడు. ఈనాడు మన జీవితంలోగూడ ప్రలోభాలు వస్తుంటాయి. మనంకూడ తోడి నరుల్లాగ చెడ్డకు పాల్పడబోతాం. లోకపు విలువలు మనలను మభ్యపెడతాయి. అప్పడు ఈ కీర్తనం మనకు కనువిప్ప కలిగిస్తుంది. ఇది 2500 ఏండ్లకు పూర్వం పుట్టినా, నేటికీ దీని విలువ తగ్గిపోలేదు. ఇది జ్ఞానకీర్తనలవర్గానికి చెందింది.

2. విభజనం

1-2 పరిచయం
3-2 దుపుల వృద్ధినిజూచి భక్తుడు ప్రలోభం చెందడం