పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 యిస్రాయేలు ప్రజలు వారి దగ్గరికి వచ్చి
     వారు చెప్పిన మాటలెల్ల నమ్మిరి

11 దేవునికి మన సంగతు లెట్లు తెలియును?
     మహోన్నతునికి జ్ఞానమెట్లలవడును అని యా దుఘ్టల వాదము

12 వీరుగో! దుష్టు లిట్టివారు
     వారు సంపన్నులైయున్నారు
     రోజురోజున క్రింకను సంపన్నులగుచున్నారు

13 మరి నేను విశుద్ధుడనుగా జీవించుటవలన ఫలితమేమి?
     దుష్కార్యములు విడనాడుట వలన లాభమేమి?

14 నేను దినమెల్ల శ్రమలతో వెతజెందితిని
     ప్రత్యుదయము శిక్షననుభవించితిని

15 నేనును ఆ దుఘ్టలవలె మాటలాడియున్నచో
     నీ ప్రజలకు తప్పక ద్రోహము చేసియుండెడివాడను

16 కాని నే నీ సమస్య నర్ధము జేసికోజూచితిని
     అది నాకు దుర్జహమయ్యెను

17 అంతలో నొకనాడు నేను దైవరహస్యమును గ్రహించితిని
     దుఘ్టల కెట్టిగతి పట్టునో తెలిసికొంటిని

18 నీవు వారిని కాలుజారి పడిపోవు తావులలో నిల్పితివి
     వారికి వినాశము దాపురించునట్లు చేసితివి

19 ఆ దుఘ్టలు క్షణములో నాశమయ్యెదరు
     ఫరోర వినాశమునగూలి కంటికి గన్పింపకుండ బోయెదరు

20 నిద్రమేల్కొన్నవాడు తాను కన్న కలను పట్టించుకోనట్లే
     ప్రభూ! నీవు నిద్రలేచినపుడు వారి నేమాత్రము లక్ష్యముచేయవు
 
21 నా హృదయము వ్యధతో నిండిపోయెను
     నా అంతరంగము మిగుల నొచ్చుకొనెను
 
22 నేను మందమతినై విషయమును గ్రహింపనైతిని
     నీ పట్ల పశువువలె ప్రవర్తించితిని