పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 ఈ కీర్తన విశేషంగా దేవుని కరుణాగుణాన్ని వర్ణిస్తుందని చెప్పాం. భగవంతునిలో అపరిమితంగా ఉండేదీ మనలో లేనిదీ దయాగుణమే. కాని దేవునికి పోలికగా కలిగింపబడిన మనం ఈ దయాగుణాన్ని వృద్ధి చేసికోవాలి. మనం ఇతరులతో మెలిగేప్పడు వాళ్ళపట్ల దయజూపుతామా? లేక ఖండితంగా ప్రవర్తిస్తామా? మన క్రిందివాళ్లు తప్పజేసినపుడు వాళ్ళను వెంటనే దండించడానికి పూనుకొంటామా లేక వాళ్ళపట్ల జాలి జూపుతామా?

కీర్తన - 73

న్యాయమే గెలుస్తుంది

1 దేవుడు యిస్రాయేలీయులకు మేలు చేసెను
    అతడు విశుద్ధ హృదయులకు మేలు చేసెను
2-3 గర్వాత్మలను గాంచి యసూయ చెందుట వలనను
    దుర్మారులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను
    నేను ప్రలోభమున జిక్కుకొంటిని
    జారి పడిపోవుటకు సంసిద్దుడనై తిని
4 ఆ దుఘ్టల కెట్టి బాధలును లేవయ్యెను
    వారు ఆరోగ్యముతో సుఘ్ఠగ నున్నారు
5 ఇతర నరులవలె శ్రమ లనుభవింపరైరి
    ఇరుగుపొరుగువారివలె ఇక్కట్టులకు గురికారైరి
6 కావున వారు అహంకారమను హారమును ధరించిరి
    హింసయను వస్త్రమును తాల్చిరి
7 బలిసిపోయి చెడుగును వెళ్ళగ్రక్కిరి
    హృదయమును కుతంత్రములతో నింపుకొనిరి
8 ఇతరుల నెగతాళి చేయుచు చెడ్డగా మాటలాడారి
    అహంకారముతో అన్యులను పీడింప నెంచిరి
9 స్వర్గములోని దేవుని దూషించుచు మాటలాడిరి
    ఇరుగుపొరుగువారికి ఆజ్ఞలు జారీచేసిరి