పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


6.మనం తరచుగా నరులను మెప్పించడానికి తాపత్రయ పడతాం. హృదయంలో కపటం ఉన్నా బయటికి మంచివాళ్ళలా నటన చేస్తాం. కాని ఆ దేవునికి మన కార్యాలూ ఆలోచనలూ అన్నీతెలుసు (34). కనుక మనం అతన్ని మెప్పించడానికి పూనుకోవాలి . ఐతే, ఆ ప్రభువుని మెప్పించాలంటే చిత్తశుద్ధితో జీవించాలి. ఈ భాగ్యాన్ని కూడ దేవుడే మనకు దయచేస్తాడు.

కీర్తన - 90

ప్రూస్వకాలికమైన నరజీవితం

1 ప్రభూ! అనాదికాలము నుండియు
  నీవే మా కాశ్రయముగా నుంటివి
2పర్వతములు పుట్టక మునుపే
  భూమియు లోకమును ఏర్పడక పూర్వమే
  అనాదికాలము నుండియు నీవు దేవుడవుగా నుంటివి
  ఎల్లకాలము నీవు వేల్పువుగా నుందువు
3 నీవు నరులను మట్టిగా మార్చెదవు
   నరులారా! మీరు మరల మన్నయి పొండని పల్మెదవ
4 నీకు వెయ్యేండ్లు ఒక్కరోజుతో సమానము,
   అవి గతించిపోయిన నిన్నటి దినముతోను
   రేయియందలి యొక్క జాముతోను సరిసమానము
5 నీవు నరులను వరదవలె ఈడ్చుకొని పోయెదవ
   వారు కలవంటివారు
   ఉదయమున మొలకెత్తు గడ్డివంటివారు
6 అది వేకువన నెదిగి పూలు పూయును
   సాయంకాలమున వాడి యెండిపోవును
7 మేము నీ కోపాగ్ని వలన మాడిపోవుచున్నాము
   నీ క్రోధమువలన గడగడ వణకుచున్నాము
8 నీవు మా పాపములను నీ ముందట నుంచుకొందువు
  మా రహస్య పాపములను నీ ముఖకాంతితో పరిశీలించిచూతువు