పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2) ఉపదేశం


కీర్తనకారుడు స్వీయచరిత్రను చెప్పకొన్నాక ఓ జ్ఞానిలాగ భావితరాలవాళ్ళకు ఉపదేశం చేస్తున్నాడు. స్వీయానుభవమే అతనికి ఈ ఉపదేశ సామర్థ్యాన్ని దయచేసింది. ఈ రెండవ భాగానికి దేవుడుగూడ కర్తగావచ్చు. కాని కీర్తనకారుడే కర్త అనుకోవడం ఇంకా ఉచితం.
8. అతడు భక్తజనులకు ఉపదేశం చేస్తున్నాడు. సన్మార్గం చూపిస్తున్నాడు.
9. గుర్రాలూ, గాడిదలూ మొండిగా, మూర్ధంగా ప్రవర్తిస్తాయి. మెడకు వారూ, నోట్లో కళ్ళెమూవేసి శిక్షిస్తేనేగాని అవి మాట వినవు. కాని జ్ఞానంకల నరులు ఈ మృగాల్లా ప్రవర్తించకూడదు. దేవునితో సహకరించి స్వయంగానే తమపాపాలకు పశ్చాత్తాపపడాలి. లేకపోతే దేవుడు వాళ్లను పై మృగాలనులాగ శిక్షించి పశ్చాత్తాపం పుట్టిస్తాడు. వివేకం గల నరుడు అంతటి దురదృష్ణాన్ని తెచ్చుకోగూడదు.
10. పాపకార్యాలు చేసే దుష్టులకు మానసిక క్షోభం కలుగుతుంది. కాని ప్రభువుని నమ్మి తమ పాపాలను ఒప్పకొనే భక్తులకు అతని ప్రేమ లభిస్తుంది. కీర్తనకారునికి ఈ రెండనుభవాలు ఉన్నాయి. కాని వీటిల్లో రెండవది మెరుగని అతడు ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నాడు.
11. పుణ్యపురుషులు సంతోషించేదీ, సంతోషనాదం చేసేదీ, దేవళంలో భక్తసమాజం ముందు. ప్రభువు తన పాపాలను మన్నించి ఆనందం దయచేసాడుకనుక వాళ్ళు భక్తబృందం ముందట అతనికి సాక్ష్యం పలుకుతారు. అతన్ని స్తుతిస్తారు.

4 ప్రార్థనా భావాలు



1. 51వ కీర్తన ఇంకా పాపంలోనేవున్న పాపి పశ్చాత్తాపాన్ని వర్ణిస్తుంది. 32వ కీర్తన తన పాపాలకు మన్నింపు పొందిన భక్తుని ఆనందాన్ని వర్ణిస్తుంది. ఈ రెండు కీర్తనల దృక్పథాలు వేరువేరు. ఐనా రెండూ రత్నాల్లాంటివే. రెండూ మన ప్రార్థనలకు ఉపకరించేవే.
2. మూడు, నాలు చరణాలు అంతరాత్మ పీడనాన్ని వర్ణిస్తాయి. మనస్సాక్షి మనహృదయంలో విన్పించే దేవుని స్వరం. దానికి మనం లొంగుతుండాలి. మామూలుగా మనం పాపంలో పడినప్పడు అంతరాత్మ చీవాట్లు పెడుతుంది. పశ్చాత్తాపపడినప్పడు ఆనందం కలిగిస్తుంది. ఈ యనుభవాలు మనకు కూడ