పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. వివరణం

1) పాపానుభవం

1-2 చరణాలు. 1-7 చరణాల్లో రచయిత తన వ్యక్తిగతమైన పాపానుభవాన్ని చెప్తున్నాడు. ఇది ఆత్మకథలాంటిది.

దేవునినుండి పాపపరిహారం పొందిన నరుడు ధన్యుడు. అతని ధన్యత్వం అతడు పొందే సంతోషంలోనే ఉంటుంది.

ఈ చరణాల్లో దేవుడు ఎవని పాపాలను మన్నిస్తాడో, ఎవని తప్పిదాలను తుడిచివేస్తాడో, ఎవనిని దోషిగా గడింపడో - అని ఒకే భావాన్ని మూడుసార్లు చెప్పాడు. కనుక కీర్తనకారుడు పాపపరిహారాన్ని గూర్చి నిశితంగా తలపోస్తున్నాడనుకోవాలి. అది యతనికి చాల ముఖ్యమైన అంశంగా తోచిందనుకోవాలి. ఇక్కడ కపటాత్ముడు అంటే పాపంచేసి దేవునిపట్ల వంచనతో ప్రవర్తించేవాడని భావం.
 
3-4 స్వీయ చరిత్రను చెప్పకొంటున్నాడు. కొంతకాలం అతడు తన తప్పలను కప్పిపెట్టుకొన్నాడు. దేవుణ్ణి తప్పించుకొందామనుకొన్నాడు, కాని ప్రభువు అతన్ని దండించాడు. అతని అంతరాత్మద్వారా అతన్ని పీడించడం మొదలెట్టాడు. రేయింబవళ్లు, దినమంతా, మానసికమైన ఆందోళనం అతన్ని తొలిచివేసింది. ఎండవేడిమికి తేమలాగ అతని సత్తువ యెండిపోయింది. అతడు చిక్కిశల్యమయ్యాడు. ఇదంతా గూడ దైవశిక్షగా భావించాడు భక్తుడు.

5. అతడు కండ్లు తెరచాడు. ప్రభువు దయచేసిన ఆంతరంగికమైన ప్రబోధం వలన తన పాపాలను ఒప్పకొన్నాడు. ప్రభువు అతని దోషాన్ని పరిహరించాడు. అతనికి లభించిన చిత్తశాంతియే యిందుకు తార్మాణం,

6. దేవుడు పవిత్రుడైన న్యాయాధిపతి. అతడు పాపులను వదలడు. అతనిముందు మన పప్పులు ఉడకవు. కనుక ద్రోహులమైన మనం మొదట మన పాపాలను చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి, అటుపిమ్మట మనకష్టాల్లో, అతనికి మొరపెట్టుకోవాలి. అప్పడు జలప్రవాహాలు పొంగివచ్చినా, అనగా పెద్ద శ్రమలు ఎదురైనా, దేవుని దయవలన గట్టెక్ముతాం:

7. తలదాచుకొనే తావంటే రక్షణదుర్గం. భగవంతుడు తనాశ్రయించిన భక్తుణ్ణి రక్షణ దుర్గంలా కాపాడతాడని భావం,