పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. నేను నా తప్ప నొప్పకొనక మౌనముగా నున్నపుడు
   దినమంతయు నిటూర్పులు విడచుచు క్రుంగి కృశించితిని
4. ప్రభూ! రేయింబవళ్ళు నీవు నన్ను కఠినముగా దండించితివి
   వేసవి వేడిమికి చెమ్మవలె
   నా సత్తువ యెండిపోయెను
5. అప్పడు నేను నా పాపము నొప్పకొంటిని
   నా యపరాధమును దాచనైతిని
   నేను ప్రభువు నెదుట నా తప్పిదము నొప్పకొందు ననుకొంటిని
   నీవు నా దోషమును మన్నించితివి
6. కనుక నీ భక్తులెల్లరు ఆపదలో నీకు ప్రార్ధన చేయవలయును
   అప్పడు జలప్రవాహములు పొంగివచ్చినను వారిని తాకజాలవు
7. నేను తలదాచుకొను చోటు నీవే
   నన్నాపదనుండి కాపాడువాడవు నీవే
   నీవు నన్ను రక్షింతువుకనుక నేను నిన్ను కీర్తినలతో స్తుతింతును
8. నేను నీ కుపదేశము చేయుదును
   నీవు నడువవలసిన మార్గమును చూపింతును
   నీ మీద దృష్టి నిల్పి నీకు సలహా నిత్తును
9. నీవు జ్ఞానములేని గుట్టమువలెను గాడిదవలెను ప్రవర్తింపవలదు
   అవి వారును కళ్ళెమును వేసిననేగాని అదుపులోనికి రావు
10. దుషులు పెక్కు వేదనల ననుభవింతురు
   కాని ప్రభుని నమ్మినవారిని యతనికృప యావరించి యుండును
11. పుణ్యపురుషులు ప్రభువునం దానందించి సంతసింతురుగాక
   నీతిమంతులు సంతోషనాదము చేయుదురు గాక,

1. పరిచయం

ఇది కృతజ్ఞతా కీర్తనల వర్గానికి చెందింది. ఈ వర్గం గీతాల్లో భక్తుడు దేవునినుండి. ఏదో ప్రత్యేక ఉపకారాన్ని పొందినందులకు అతనికి వందనాలర్పిస్తాడు. దేవుడతన్ని వ్యాధి, మృతువు, శత్రుపీడనం మొదలైన వాటినుండి కాపాడి ఉండవచ్చు. లేదా అతని పాపాన్ని