పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నా వుపదేశకు లందరికంటె నే నెక్కువ గ్రహించాను
నీ వుపదేశాలను పాటించడం వలన
నేను వృధులకంటె యొక్కువ జ్ఞానం ఆర్థించాను
నీ వాక్యాలు నా నోటికి తీయగా ఉన్నాయి
తేనెకంటె మధురంగా ఉన్నాయి
నీ వాక్యం నా పాదాలకు దీపం
నా త్రోవకు వెలుగు
నేను నీ వాక్యాలను జూచి
పెన్నిధిని గనుగొన్న పేదలాగ ఆనందిస్తాను
బంగారంకంటె, మేలిమి బంగారంకంటె యొక్కువగా
నేను నీ కట్టడలను ఆశిస్తాను
నేను రేయెల్ల మేల్కొని ఉండి
నీ వాక్యాలను ధ్యానించుకొంటాను.

కీర్తన - 23

మంచి కాపరి

1 ప్రభువే నాకు కాపరి, ఇక యే కొదవయు లేదు
2 అతడు నన్ను పచ్చిక పట్టులలో మిశ్రమింపజేయును
  శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొనిపోవును
3 నా బడలికలను తొలగించును
  తాను వాగ్దానము చేసినట్లే
  నన్ను ధర్మమార్గమున నడిపించును
4 గాధాంధకారపు లోయగుండ పయనించునపుడును
  నే నెట్టి యపాయమునకును జంకను
  ప్రభూ! నీవు నాకు తోడుగా నుందువు
  నీ బడితయు నీ కోలయ నన్ను కాపాడుచుండును