పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ప్రభువు ఈలా అంటున్నాడు
నన్ను విడనాడి నరుని నమ్మేవాడు,
నరమాత్రుని మీద ఆధారపడేవాడు,
శాపగ్రస్తుడు
అతడు ఎడారిలో ఎదిగే తుప్పలాంటివాడు
అతనికి ఏలాంటి మేలూ కలుగదు
ఆ తుప్ప ఎండివున్న మరుభూమిలో,
ఏమీ పెరగని చౌటిపర్రలో పెరుగుతుంది
కాని నన్ను నమ్మి నాపై ఆధారపడేవాణ్ణి
నేను దీవిస్తాను
అతడు ఏటి వొడ్డున ఎదుగుతూ
నీటి చెంతకు వేళ్లు చాచే చెట్టులాంటివాడు
అది బెట్టకు భయపడదు
దాని యాకులు పచ్చగా ఉంటాయి
వానలు కురువకున్నా దానికి చింతలేదు
అది యెల్లపడు పండ్లు కాసూంటుంది",

6 ఈ మొదటి కీర్తనలాగే 119వ కీర్తనకూడ జ్ఞాన కీర్తనం. దీనిలాగే అది కూడ ధర్మశాస్తాన్ని భక్తితో పారాయణం జేసికోవాలని చెప్తుంది. మనకు వాక్యభక్తి అవడ్డానికి ప్రస్తుతానికి దానిలోని ఈ క్రింది చరణాలను పరిశీలిద్దాం.
- 11, 18, 73, 92, 99 - 100, 103, 105, 162, 127, 148.

"నేను నీకు ద్రోహంగా పాపం చేయకుండా ఉండడానికై
నీ వాక్యాన్ని నా హృదయంలో నిల్పుకొన్నాను
నీవు నా కన్నులు తెరిచావంటే
నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుత విషయాలు గ్రహిస్తాను
నన్ను పుట్టించి సంరక్షించే ప్రభూ!
నీ యాజ్ఞలను నేర్చుకొనే వివేకం నాకు ప్రసాదించు
నీ ధర్మశాస్త్రం నాకు ఆనందాన్ని యిచ్చివుండకపోతే
నాకు సంభవించిన శ్రమల్లో నేను నాశమైపోయేవాణ్ణి
నీ శాసనాలను ధ్యానించుకోవడంవల్ల