పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదశాస్తుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వేదశాస్తుల భావం ప్రకారం ఇది లోకాంతంలో జరుగుతుంది. ఈ భావాన్నే గనుక తీసికొంటే క్రీస్తు మోక్షంలో మళ్ళా తన శిష్యులతో విందారగిస్తాడు, ద్రాక్షాసవం సేవిస్తాడు అని చెప్పాలి. కాని కొందరు వేదశాస్తులు శ్రీసభ ప్రారంభం కావడమే దైవరాజ్యం రావడమని చెప్పారు. బహుశ ఇది పైదానికంటె మెరుగైన అర్థం. క్రీస్తు చనిపోయి పరిశుద్దాత్మ శిష్యులమీదికి దిగిరాగానే శ్రీసభ ప్రారంభమైంది. కనుక ఇప్పడు శ్రీసభలో ప్రభువు ద్రాక్షాసవం సేవిస్తాడు. అనగా నేడు గురువులు క్రీస్తుతో ఐక్యమై పూజను అర్పిస్తాడు. కనుక అతడూ గురువులతో ఐక్యమై ద్రాక్లాసవం సేవిస్తాడు. నేటి శ్రీ సభలో ప్రతిదినము సత్రసాద విందులో పాల్గొంటున్నాడు.

ఈ యధ్యాయంలో మనం పేర్కొన్న భావాలన్నీ ఇప్పడు క్రొత్త పూజలోకూడ కన్పిస్తాయి. పూజలో "కావున తండ్రి! మా రక్షణ స్మృతిని కొనియాడుతూన్నాం. క్రీస్తు మరణాన్నీ అతడు పాతాళానికి దిగడాన్నీ జ్ఞాపకం చేసికొంటున్నాం. అతడు ఉత్తానుడై నీ కుడిప్రక్కన కూర్చోవడాన్ని ప్రకటిస్తున్నాం" అంటాం. ఇంకా “తండ్రీ! అతని మరణాన్నీ ఉత్తానాన్నీస్మరిస్తూ జీవాన్నోసగే ఈ యప్పాన్నీ రక్షణ పాత్రనీ నీకు సమర్పిస్తున్నాం" అని చెప్తాం. ఈ విధంగా మనం నమ్మే దైవశాస్తాంశాలనే మన ఆరాధనలో కూడ వ్యక్తం చేసాం.

ప్రార్థనాభావాలు

1. మాప్సవెస్తియా తియొడోరెట్ అనే వేదశాస్త్రి"దివ్యసత్రసాదం దేవుని రక్షణకార్యాల మీద వ్యాఖ్య చెప్తుంది" అన్నాడు. అనగా ఈ ప్రసాదం దేవుని రక్షణ కార్యాలను వివరిస్తుంది. దేవుడు క్రీస్తుద్వారా మనకు దయచేసిన పాపవిముక్తికీ వరప్రసాద ప్రాప్తికీ నిదర్శనంగా వుంటుంది. కనుక మనం భక్తిభావంతో దివ్యసత్రసాదబలిని అర్పించాలి.

2. క్రిసోస్తం అనే భక్తుడు ఈలా వ్రాసాడు. “మనం రోజూ పూజబలులు అర్పించినా అవి చాలా బలులు కాదు, ఒకే బలి. ఈ బలులన్నీ ఒకే ఒక్క బలిని అర్పించిన క్రీస్తు సిలువ బలికి జ్ఞాపకార్థాలు. కనుక దానితో కలుపుకొని ఇవన్నీ ఒకే బలి ఔతాయి. ఈ బలులన్నిటిలోను బలిపశువు ఒక్కటే - క్రీస్తు. కనుక ఇవన్ని ఒకే బలి కాని చాలా బలులు కావు. పూర్వవేదం లోని యాజకుల్లాగ మనం ప్రతిసారీ క్రొత్తబలి నర్పించం. దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని పల్కిన క్రీస్తు ఏకైక