పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. సామాన్య ప్రశ్నలు

1 నేటి క్రైస్తవులకు పాపోచ్చారణ సంస్కారం పట్ల భక్తి శ్రద్ధలు ఎందుకు సన్నగిల్లిపోయాయి? ఈ యనర్గాన్ని చక్కదిద్దడం ఏలా?

2 పశ్చాత్తాప విషయంలో మిూకు వ్యక్తిగతంగా నచ్చిన వేదవాక్యాలను పేర్కొనండి.

3 గురువుకి పాపోచ్చారణ చేయడంలో వున్న అనిష్టతను తెలియజేయండి. ఆ గుణాన్ని జయించడం ఏలా? ఈ సంస్కారాన్ని అనిష్టమైనదాన్నుండి ఇష్టమైనదాన్నిగా మార్చడం ఎలా?
 
4 తప్పిపోయిన కుమారుని కథ సహాయంతో చిన్నపిల్లలకు పాపాన్నీ పశ్చాత్తాపాన్నీ గూర్చి యేలా బోధిస్తారో చెప్పండి.
5 పెద్దవాళ్ళే అయిన పామరజనానికి పాపాన్నీ పశ్చాత్తాపాన్నీ ఏలా బోధిస్తారో తెలియజేయండి.
 
6 ఒకోసారి మన తప్పిదాలను ఇతరులకు చెప్పకోవాలనిపిస్తుంది. దీని అర్ధంఏమిటి?
 
7 రాజారావు మంచిపాపోచ్చారణమే చేస్తుంటాడు. కాని అతడు తన దురభ్యాసాలను సవరించుకోలేక నిరుత్సాహపడుతుంటాడు. అతనికి నీవేమి సలహా యిస్తావు?

8 పాపోచ్చారణమంటే పాపి కేవలం వ్యక్తిగతంగా దేవునితో సమాధానపడే క్రియ మాత్రమే కాదు, క్రైస్తవ సమాజమైన శ్రీసభతో గూడ సమాధానపడే క్రియ అని ప్రజలకు ఏలా బోధిస్తావు?

బైబులు అవలోకనాలు

పాపమూ పశ్చాత్తాపమూ

1 ఆదాము పాపం - ఆది 3,1-7
2 కయిను హేబెలును చంపడం - ఆది 4,8-12
3 యిస్రాయేలీయులు దూడను కొల్వడం - నిర్గ 32,1-6
4 ఆజ్ఞలను పాటిస్తే జీవం, మిరితే మరణం - ద్వితీ 30, 15-20
5 దావీదు పాపం - 2సమూ 12,1-13
6 యిస్రాయేలీయులు తమ పాపాలను ఒప్పకోవడం - నెహెమ్యా 9,1-20
7 విజ్ఞానం పాపుల హృదయాల్లోకి ప్రవేశించదు - సాలోమోను జ్ఞాన 1,4-5