పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన్నింప మనమిూద పనిచేసినట్లుకాదు. ఇంకా తోడినరులను ప్రేమభావంతో చూస్తాం. వాళ్ళ అక్కరలో మనకు చేతనైన సహాయం చేస్తాం. వాళ్ళను మన స్వార్ణానికి వాడుకోవడం మానివేస్తాం. నే నొక్కడనే గాదు, నేనూ తోడి జనులూ అందరమూ కలసి దైవప్రజలం ఔతాం అన్నట్లుగా జీవిస్తాం. ఎప్పడుగూడ పాపోచ్చారణ సంస్కారం మనలను తోడిప్రజలతో ఐక్యపరుస్తుంది. అది కేవలం వ్యక్తిగతమైన క్రియకాదు. కనుక భక్తులు ఈ సంస్కారంలోని సామూహిక గుణాన్ని చక్కగా అర్థం చేసికోవాలి.

ప్రశ్నలు

అధ్యాయం - 1

1 పరివర్తనంలోని ముఖ్యాంశాలను వివరించండి
2 పరివర్తనంలోని దేవుని కృషియేమిటి, మన సహకారమేమిటి?
3 క్రీస్తు ద్వారా పాపపరిహారం ఏలా జరుగుతుందో వివరించండి.
4 ఆత్మకూ పాపపరిహారానికీ వున్న సంబంధమేమిటో తెలియజేయండి.
5 మన పాపాలను గురువుతో ఎందుకు చెప్పాలి?

అధ్యాయం - 2

1 పాపాన్ని గూర్చిన పూర్వ నూత్నవేద భావాలను సంగ్రహంగా పేర్కొనండి.
2 "ఆధునిక ప్రపంచం పాపాన్ని అట్టే లెక్కచేయడం లేదు" - వివరించండి.
3 పాపంలో వుండే సామూహిక గుణాన్ని వివరించండి.
4 చావైన పాపానికీ స్వల్పపాపానికీ వుండే ప్రధాన వ్యత్యాసాలు ఏమిటివి?
5 చావైన పాపానికీ "చావును తెచ్చిపెట్టే పాపానికీ" వ్యత్యాసం ఏమిటి?

అధ్యాయం - 3

1 పశ్చాత్తాపాన్ని గూర్చిన పూర్వ నూత్నవేద భావాలను సంగ్రహంగా పేర్కొనండి.
2 మత్తయి 18, 18 మరియు యోహాను 20,21-23 వాక్యాల భావాన్ని వివరించి అవి నేటి మన పాపోచ్చారణ సంస్కారానికి ఆధారవాక్యాలని నిరూపించండి.
3 ఈ వాక్యాలకు ప్రోటస్టెంటులు చెప్పే అర్థం ఏమిటి? ఆ యర్ధం సబబు కాదని నిరూపించడం ఏలా?