పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దివ్యవాక్యానికి మన హృదయాన్ని మార్చే అద్భుతశక్తి వుంటుంది. అది మన దోషాలను ఎత్తి చూపిస్తుంది. ఓ న్యాయాధిపతియై మనకు తీర్పు చెప్తుంది - హెబ్రే 4,12. కనుక పాపోచ్చారణం చేసే భక్తుడు వాక్యపు వెలుగులో తన్నుతాను పరిశీలించి చూచుకోవాలి. వాక్యప్రభావంవల్ల సత్యానికిలొంగి తన తప్పలను పూర్తిగా అంగీకరించాలి. వాక్యపు శక్తితోనే పరివర్తనం చెందాలి. కనుక భక్తుడు కనీసం రెండుమూడు నిమిషాలైనాసరే వాక్యాన్ని చదువుకొని మననం చేసికొనిగాని పాపోచ్చారణం చేయకూడదు. భక్తసమాజం పాపోచ్చారణం చేసేప్పుడు గురువు ప్రారంభంలోనే వాక్యాన్ని చదివి వివరణం చెప్లే మంచి ఫలితం కలుగుతుంది.

2 ప్రతి సంస్కారంలోను క్రీస్తు పాస్కపరమరహస్యం పని చేస్తుంది. క్రీస్తు సిలువమిూద చనిపోయి, ఉత్తానమై, పాపపరిహారంచేసి తండ్రియొద్దకు వెడలిపోయాడు. అదే అతని పాస్మరహస్యం. ఈ పరమరహస్యం పాపోచ్చారణంలో కూడ పనిచేస్తుంది. ఆ ప్రభువు మరణోత్తానాలవలన మన పాపాలకు మన్నింపు కలుగుతుంది. అతని వరప్రసాదం మనలను భావిపాపాలనుండికూడ కాపాడుతుంది. ఇంకా ఆ వరప్రసాదం మనం భక్తితో జీవించేలానూ, క్రీస్తు రెండవరాకడ కొరకు నమ్మకంతో వేచివుండేలానూ చేస్తుంది. కనుక మనం ఉత్తాన క్రీస్తు పాస్కరహస్యాన్ని నమ్మి పాపోచ్చారణం చేయాలి. ప్రభువు కరణవల్లనే మనకు పాపవిముక్తి కలుగుతుందని పూర్ణంగా విశ్వసించాలి.

3 చాలమంది పాపోచ్చారణ క్రియ యోగ్యంగా దివ్య సత్ర్పసాదాన్ని పుచ్చుకోవడానికి మాత్రమే తోడ్పడుతుందని భావిస్తారు. ఇది పొరపాటు. ఈ సంస్కారంవల్ల మనం హృదయశుద్ధినిపొంది భక్తితో దివ్యసత్రసాదాన్ని స్వీకరిస్తాం. నిజమే. కాని ఈ సంస్కారం ఫలితం అంతమాత్రమే కాదు.

పాపోచ్చారణం ద్వారా శ్రీసభలోని క్రైస్తవులతో సమాధానపడతాం గూడ. పూర్వం పాపం ద్వారా క్రైస్తవ సమాజం నుండి విడిపోయాం. ఇప్పుడు ఈసంస్కారంద్వారా మళ్ళా ఈ సమాజంలోనికి, ఈ మందలోనికి తిరిగివస్తాం. తోడి నరులందరినీ మన అక్కచెల్లెళ్లనుగాను అన్నదమ్ములనుగాను అంగీకరిస్తాం. ఇతరులకీ మనకీ ఒక్కడే తండ్రి, పితయైన సర్వేశ్వరుడు. కనుక తోడినరులతో రాజీపడి వాళ్ళ అపరాధాలను క్షమిస్తాం. దేవుడు మన తప్పిదాలను క్షమించినట్లే మనంగూడతోడినరుల తప్పిదాలను క్షమిస్తాం. ఈలా మన్నించకపోతే దేవుని