పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాపాలను గుర్తించేలా చేయును గాక. నీవు అతని కరుణను నమ్మేలా చేయును గాక" అనే ప్రార్థన చెప్తారు. లేదా "ప్రభువు నీ హృదయంలో వుండి నీవు నిజమైన పశ్చాత్తాపంతో నీ పాపాలను ఒప్పకొనే భాగ్యం దయచేయునుగాక" అనే జనం చెప్తారు.
గురువు ఆహ్వానం ద్వారా ప్రార్ధనంద్వారా విశ్వాసికి నమ్మకమూ ధైర్యమూ కలగాలి. గురువు వాలకం కరుణగల పరలోకపు తండ్రినీ, మంచి మేపరియైన క్రీస్తనీ తలపించేలా వుండాలి, “క్రీస్తు కరుణా ప్రేమా ప్రత్యక్షమయ్యాయి" అన్నాడు పౌలు - తీతు 3,3. గురువులో ఈ గుణం కన్పించాలి. ఈ నియమం ఒక్క పాపోచ్చారణాన్ని వినే సమయానికి మాత్రమేకాదు, అతని జీవితానికంతటికీ వర్తించాలి.

2. దివ్యగ్రంథ పఠనం

విశ్వాసి ఏదైనా వేదవాక్యాన్ని చదివి కొద్దిసేపు మనం చేసికోవడం మంచిది. అప్పటికప్పుడు కాలవ్యవధి లేకపోతే అతడు ముందుగానే వేదవాక్యాన్ని చదువుకొని వుండడం మేలు. లేదా గురువు ఏదైనా వేదవాక్యాన్ని అప్పటికప్పడు నోటితో చెప్పవచ్చుగూడ, వాక్యపఠనం ద్వారా క్రైస్తవుడు వెలుగును పొంది తన పాపాలను తెలిసికొంటాడు. దేవుని కరుణను గుర్తించి భక్తితో పశ్చాత్తాపపడతాడు.

ఈ సందర్భానికి తగిన కొన్ని వేదవాక్యాలు ఇవి. "యోహాను చెరలో బంధింపబడ్డాక యేసు గలిలయ సీమకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. కాలం ఆసన్నమైంది, దైవరాజ్యం సమీపించింది, కనుక పశ్చాత్తాపపడి సువార్తను విశ్వసించండి అని బోధించాడు" - మార్కు 1,14-15. “మనం పాపులమై యుండగా క్రీస్తు మనకొరకు చనిపోయాడు అంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని రుజువెతుంది" - రోమా 5,8. "నేను పాపలను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికీ రాలేదు" - మత్త 9, 13.

ఈ వాక్యపఠనం అనేది ప్రస్తుత నూత్న విధిలో ప్రముఖమైన అంశం. ఈ పఠనంద్వారా ప్రభువే మనతో మాటలాడతాడు. ఇంకా వాక్యం మనకు చిత్తశుద్ధిని దయచేస్తుంది. “మనకు పాపం లేదు అనుకొంటే మనలను మనమే వంచించు కొన్నట్లవుతుంది. మనలో సత్యముండదుకూడ" - 1యేూ1,8. కొంచెం కాలం పట్టినా మన విశ్వాసులు ఈ పఠనాభ్యాసాన్ని పెంపొందించుకోవడం లాభదాయకం.

8. పాపోచ్చారణమూ, ప్రాయశ్చిత్తాన్ని విధించడమూ

తర్వాత విశ్వాసి పాపోచ్చారణం చేయడమూ గురువు ఉపదేశం చేయడమూ జరుగుతుంది. అన్యాయం దొంగతనం మొదలైన విషయాలు వచ్చినప్పడు గురువు