పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 మరో ప్రార్ధనం ఇది. "ప్రభూ! నీవు మమ్మ శిక్షించేపడు నీ న్యాయాన్నికనపరుస్తావు. మమ్మ క్షమించేపుడు నీ కరుణను చూపెడతావు. నీవు మమ్మ శిక్షించేపుడు గూడ మమ్మ నరకయాతనలకు గురిచేయవు. మమ్మ శిక్షించకుండా వదలివేసేపడు మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికోవడానికి చాలినంత వ్యవధిని దయచేస్తావు. ఈలాంటి కరుణగల దేవుడివైన నీకు నమస్కారాలు."

5 పాపోచ్చారణ సంస్కారంలో గురువు న్యాయాధిపతిగా వ్యవహరించేమాట నిజమే. అతడు క్రీస్తు తరపునా శ్రీసభ తరపునా న్యాయాధిపతిగా నిల్చి పాపి పాపానికి తీర్పుజెప్తాడు. ఐనా అతడు కటువుగాగాని, పాపికి భయం పుట్టించేలాగాని ప్రవర్తించగూడదు. చాల మృదువుగాను దయతోను మెలగాలి. అసలు అతడు న్యాయాధిపతిగాకంటె, దయగల వైద్యుడుగా చూపట్టాలి. వైద్యుడు రోగానికిమల్లె గురువు పాపరోగానికి చికిత్సచేసేవాడు. క్రీస్తు స్వయంగా ఈ వుపమానం వాడుకొన్నాడు—మత్త 9,12. కనుక గురువు పాపిపాపం ఇంత గొప్పది అని గణిస్తున్నట్లుగా చూపట్టగూడదు. దేవుని దయ మంచితనం పితృత్వం ఈలా వుంటాయి అని చాటి చెప్తున్నట్లుగా చూపట్టాలి. క్రీస్తు పాపులపట్ల ఎంతో కరుణతో మెలిగాడు. ఆ తీరే గురువుకి గూడ తగుతుంది. అతడెప్పడు గూడ దయామయుడైన దేవుడికి ప్రతినిధిగా వుండేవాడు.

8. పాపోచ్చారణ విధి


ఈ చివరి అధ్యాయంలో 1973లో తయారై ఇటీవలే ప్రచారంలోనికి వచ్చిననూత్న పాపోచ్చారణ విధిని పరిశీలిద్దాం. ఈ విధిలో మళ్ళా మూడు రకాలున్నాయి. కాని మనం మామూలుగా వాడుకొనేది మొదటిరకం విధిని, కనుక యిక్కడ మొదటిరకం విధిని మాత్రమే పరిశీలిద్దాం. దీనిలో ఆరంశాలు విశేషంగా గమనింపదగ్గవి.

1. విశ్వాసిని ఆహ్వానించడం


గురువూ విశ్వాసీ ఇద్దరూ పాపోచ్చారణ సంస్కారానికి తయారుకావాలి. గురువుతనకు వెలుగునూ ప్రేమనూ దయచేయమని పరిశుద్దాత్మను అడుగుకోవాలి. విశ్వాసి తన పాపాలకు మన్నింపు దయచేయమని దేవుణ్ణి వేడుకోవాలి.

తర్వాత గురువు విశ్వాసిని ఆహ్వానిస్తారు. ఇద్దరూసిలువ గుర్తు వేసికొంటారు.గురువు విశ్వాసిని ఆదరంతో అంగీకరించి ఆ సందర్భానికి తగిన భక్తిమంతమైన ప్రార్ధనం చెప్తారు. ఉదాహరణకు "అందరి హృదయాలకు వెలుగును ప్రసాదించే ప్రభువు నీవు నీ